Categories: Movie News

వైద్యం చేయించలేని పరిస్థితుల్లో ఉన్న పేదలకు ఉచితంగా హార్ట్ సర్జరీలు: లారెన్స్..షేర్ చేయండి..

రాఘవ లారెన్స్…అతను తెలియని వారే ఉండరు.. అతను మంచి డ్యాన్సరే కాదు. ఆర్టిస్టు కూడా. అంతకు మించి మంచి మనసున్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు. తన తల్లికి గుడి కట్టి.. తన లోని ప్రేమను చాటుకున్నాడు.తానే ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనాథలు, రైతులు, దివ్యాంగులు, మహిళలు, చిన్నారులకు హార్ట్ సర్జన్లు చేయిస్తున్నాడు. తను సంపాదించిన దాంట్లో కొంత మొత్తం దాతృత్వ కార్యక్రమాలకే ఉపయోగిస్తున్నాడు లారెన్స్. దానికి సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటాడు లారెన్స్.

తాజాగా ఓ చిన్నారి హార్ట్ ఆపరేషన్ సక్సెస్ అయిన విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా తెలియజేశాడు లారెన్స్. శివాని అనే బాలిక గుండెలో చిన్న రంధ్రం ఉంది. ఆ బాలికది నిరుపేద కుటుంబం. ఈ విషయం తెలుసుకున్న లారెన్స్.. చిన్నారికి ఆర్థిక సాయంతోపాటు బాలిక వైద్య చికిత్స అవసరం అయిన అన్ని వసతులను దగ్గరుండి మరీ చూశారు. ఆపరేషన్ చేయించారు. పాప ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు బాలిక ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యింది. ఈ విషయాన్ని చెబుతూ.. ‘మా 141వ ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతమైంది! ఈమె శివాని. ఈమే వయసు ఒక సంవత్సరం. ఈమె గుండెలో చిన్న రంధ్రం ఉంది. ఆమెకు విజయవంతంగా ఆపరేషన్ చేయించి ఇంటికి పంపించాం. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న డాక్టర్ల బృందానికి, ఇతర సభ్యులకు మా ధన్యవాదాలు’ అని తన ఫేస్‌బుక్ పేజ్ లో పోస్ట్ చే శాడు లారెన్స్.

ఎవరైనా చిన్నపిల్లలు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ, తల్లిదండ్రులు దగ్గర వైద్యం చేయించలేని పరిస్థితుల్లో ఉన్నట్లు మీకు తెలిస్తే తమకు తెలియజేయాలని లారెన్స్ కోరారు. దయచేసి “ది లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్” ఫోన్ నంబర్లు 09790750784, 09791500866కు ఫోన్ చేసి విషయం తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago