Featured

బంపర్ ఆఫర్ కొట్టేసిన వంటలక్క.. స్టార్ హీరో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ..!

ప్రేమి విశ్వనాథ్ అంటే మన తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ కార్తీక దీపం వంటలక్క అంటే మాత్రం టక్కున గుర్తు పట్టేస్తారు. అంతలా ‘కార్తిక దీపం’ సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది ప్రేమి. చిన్నా, పెద్దా, ఆడ, మగా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ రాత్రైతే చాలు టీవీలకు అతుక్కు పోయేలా చేస్తోంది మన వంటలక్క. వంటలక్క నట విశ్వ రూపానికి టీఆర్పీ రేటింగ్స్ లో కూడా మరే ఇతర సీరియల్స్ పోటీ పడలేకపోతున్నాయి. దీప అలియాస్ వంటలక్క క్యారెక్టర్ చేస్తున్న నటి ప్రేమి విశ్వనాథ్ ఈ సీరియల్ ద్వారా ఎంతగా పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

ఇక ఈ టీవీ సీరియల్‌తో వచ్చిన క్రేజ్.. ఆమెకు వెండితెరపై అవకాశాలు కూడా తెచ్చిపెడుతుంది. అయితే ప్రేమి విశ్వనాథ్ ఇప్పటి వరకు ఏ సినిమాకి కూడా సైన్ చేయలేదు. కానీ తాజాగా ఒక తెలుగు సినిమాకు ప్రేమి విశ్వనాథ్ ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని హీరోగా దర్శకుడు లింగుస్వామి తెరకెక్కే నూతన చిత్రంలో ప్రేమి విశ్వనాథ్ కు మంచి రోల్ చేయడానికి వంటలక్క చెప్పినట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలో దర్శకుడు లింగు స్వామి సినిమా కథతో పాటూ ప్రేమి విశ్వనాథ్ ఇంటికి వెళ్లి ఆ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో వివరించాడట. లింగుసామి చెప్పిన పాత్ర నచ్చడంతో వంటలక్క ఈ సినిమాలో నటించడానికి ఒకే చెప్పిందని తెలుస్తుంది. అయితే త్వరలో ప్రేమి విశ్వనాథ్ టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీకి గురించి అపీషియల్ ప్రకటన చేయబోతున్నారని సమాచారం. బుల్లితెరపై తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన వంటలక్క బిగ్ స్క్రీన్ పై ఏ రేంజ్‌లో అలరిస్తుందో వేచి చూడాలి..

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

6 hours ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

6 hours ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

6 hours ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

6 hours ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

6 hours ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

6 hours ago