పేద, మధ్య తరగతి వారు భవిష్యత్తులో వచ్చే అవసరాలకోసం కొంచెం డబ్బులు దాచుకోవడం, బ్యాంకులలో ఫిక్సిడ్ డిపాజిట్లు చేసుకోవడం బాగా చేస్తుంటారు. ఇలాంటి వారికోసం ఒక శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.
డిపాజిట్లపై భీమాను ఒక లక్ష రూపాయిల నుంచి ఐదు లక్షల వరకు పెంచింది. ఈరోజు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్. డిపాజిటర్ల డబ్బుకు రక్షణ కల్పించడం కోసం ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే ప్రస్తుతం డిపాజిట్లపై ఒక లక్ష రూపాయిలు మాత్రమే భీమా ఉందని, ఈ భీమాను ఏకంగా ఐదు లక్షలకు పెంచి డిపాజిట్ చేసే ప్రజలకు ఈ శుభవార్త చెప్పారు నిర్మల సీతారామన్.
ఇటీవల బ్యాంకింగ్ రంగంలో మోసాలు పెరిగిపోతుండటంతో డిపాజిట్ చేసే వారిలో ఆందోళన మొదలై, భయం పెరుగుతుంది. ఇప్పుడు అలాంటి వారిలో భయాన్ని తగ్గించి, వారికీ భరోసా ఇవ్వడం కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇంతకు ముందు రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ చేసిన డిమాండ్ చేసిన కాస్త పరిగణంలోకి తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ప్రస్తుతం లక్ష రూపాయలుగా ఉన్న బీమాను పది లక్షలకు పెంచాలంటూ వారు చేసిన డిమాండ్ చేసిన సంగతి తెలిసందే.
అయితే డిపాజిట్ల మీద ఉన్న భీమాను 1993 తరువాత ఇప్పుడు మాత్రమే బీమాను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం విశేషం. మొత్తానికి ఈ బడ్జెట్ లో కేంద్రం ప్రకటించిన ఈ భీమా పేద, మధ్య తరగతి ప్రజలకు కాస్త ఊరటనిచ్చేదిగా ఉందని చెప్పుకోవాలి. అంతే కాదు ఈ బడ్జెట్ లో మరిన్ని నూతన మరియు కీలక నిర్ణయాలను తీసుకున్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…