కొత్త డైరెక్టర్ రమణ తేజ దర్శకత్వంలో హీరో నాగ సౌర్య, హీరోయిన్ మెహ్రిన్ కలియికలో వచ్చిన చిత్రం “అశ్వద్ధామ”. ఈ చిత్రం నిన్న జనవరి 31న విడుదలైంది. చలో, నర్తనశాల వంటి సినిమాలతో టాలీవుడ్ లో తనదంటూ ఒక ముద్ర వేసుకున్న ఉషా మూల్పూరి నిర్మించారు. “ఐరా క్రియేషన్స్” బ్యానర్ పై ఈ చిత్రం నిన్న 31వ తారీఖున విడుదల చేసారు.
ఈ చిత్రంపై కాస్త మిక్సిడ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే కొంత మంది మాత్రం ఈ చిత్రానికి బాగానే కనెక్ట్ అయ్యారు. చిత్రానికి మంచి ప్రశంసలు కురిపిస్తున్నారు. టీజర్, ట్రైలర్ విడుదల సమయం నుంచి ఈ చిత్రానికి క్రేజ్ బాగానే వచ్చింది. దీనికి తోడు సంక్రాంతి స్పెషల్ అంటూ నాగ సౌర్య బుల్లి తెరపై బాగానే ప్రోగ్రామ్స్ చేసాడు.. ఈ విధంగా తెలుగు ఆడియన్స్ లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ తీసుకువచ్చాడు నాగ సౌర్య. సొంత బ్యానర్ కావడం వల్ల కాస్త ఎక్కువగానే ప్రమోషన్స్ కోసం కష్టపడ్డాడు. ఈ చిత్రానికి నాగ సౌర్య కథని అందించడం విశేషం.
అయితే ఇక ఈ చిత్రం మొదటి రోజు ఎంత వసూలు చేసిందో చూద్దాం
నైజాం – 0.29 CR
సీడెడ్ – 0.08 CR
ఉత్తరాంధ్ర – 0.14 CR
ఈస్ట్ – 0.07 CR
వెస్ట్ – 0.06 CR
కృష్ణ – 0.08 CR
గుంటూరు – 0.07 CR
నెల్లూరు – 0.03 CR
రెస్ట్ అఫ్ ఇండియా – 0.10 CR
ఓవర్సేస్ – 0.12 CR
వరల్డ్ వైడ్ టోటల్ – 1.04 CR (షేర్)
ఈ చిత్రం మొత్తం 7.2 కోట్ల బిజినెస్ చేసింది. మొదటి రోజు 1.04 కోట్ల షేర్ ను వాసులు చేసింది “అశ్వద్దామా”. మరో 6.16 కోట్ల షేర్ వాసులు చేస్తే బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది ఈ చిత్రం. ఇంకా వీక్ ఎండ్ కావడం, మరో సినిమా పోటీలో లేకపోవడం కాస్త కలిసొచ్చే అంశం. వీకెండ్ పూర్తయ్యేసరికి ఎంత వరకు సాధించ గలుగుతుందో చూడాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…