తెలుగులో సూపర్ పాపులారిటీ సంపాదించిన రియాలిటీ షో అంటే బిగ్ బాస్ అనే చెప్పాలి. కరోనా సమయంలో కూడా సీజన్-4 ఎంత విజయవంతమయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక త్వరలో ప్రారంభం కానున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ – 5 నుంచి హోస్ట్ గా నాగార్జున తప్పుకున్తున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
నిన్న మొన్నటి వరకు నాగార్జునే బిగ్ బాస్ సీజన్ 5 కి కూడా హోస్ట్ అని స్టార్ మా కూడా చాలా గట్టిగానే చెప్పుకొచ్చింది. ఇక తాజగా సీజన్ 5 నుంచి కింగ్ నాగార్జున తప్పుకుంటున్నాడని.. ఆయనకి బదులుగా హీరో దగ్గుబాటి రానా వచ్చి బిగ్ బాస్ 5 హోస్ట్ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. బిజీ షెడ్యూల్ కారణంగా నాగార్జున ఈ షో నుంచి తప్పుకుంటున్నాడని తెలుస్తోంది. కరోనా కారణంగా ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ఆగిపోవడంతో వాటిని పూర్తీ చేసేపనిలో పడ్డాడట కింగ్ నాగార్జున.
అందువల్ల ఈ స్థానంలో రానా దగ్గుబాటితో హోస్ట్ చేయించాలని ప్రయత్నిస్తున్నారట నిర్వాహకులు. ఇప్పటికే బుల్లితెరపై రానాకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నెం 1 యారీతో ప్రోగ్రాం హోస్ట్ గా మంచి అనుభవం ఉన్న విషయం తెలిసిందే. అందుకే రానా బిగ్ బాస్ 5ను బాగా చేయగలడని నిర్వాహకులు కూడా నమ్ముతున్నారు. దీనికోసం స్టార్ మా ఈ హీరోకు భారీ మొత్తమే చెల్లించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి నిజంగానే కింగ్ నాగార్జున బిగ్ బాస్ 5 నుంచి బిజీ షెడ్యూల్ వాల్ల తప్పుకున్నాడా లేక ఇదంతా కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న ఉత్తుత్తి ప్రచారమేనా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…