దర్శకరత్న దాసరి నారాయణరావు 1970 వ దశకంలో ఆయన సినీ ప్రయాణం మొదలైంది. 1972 కె.రాఘవ నిర్మాణ సారథ్యంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో తాతా మనవడు చిత్రం విడుదలయింది. ఈ సినిమాలో ఎస్.వి.రంగారావు ప్రధాన పాత్రలో కనిపించగా హీరో హీరోయిన్లుగా రాజబాబు, విజయనిర్మల నటించారు. ఆ రోజుల్లో ఈ సినిమా దాదాపు 25 వారాలపాటు ఆడింది. మొదటి సినిమానే దాసరి నారాయణరావుకి మంచి పేరు తీసుకువచ్చింది.
తరువాత సంసారం సాగరం, బంట్రోతు భార్య… లాంటి సినిమాలు తీస్తున్న క్రమంలో దాసరి ఏడవ సినిమాగా 1975లో స్వర్గం నరకం సినిమా వచ్చింది. ఇందులో మోహన్ బాబు, అన్నపూర్ణ, ఈశ్వరరావు, జయలక్ష్మి హీరో,హీరోయిన్లుగా నటించారు. దాసరి నారాయణరావు ఇందులో ఓ ప్రధాన పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే అన్నపూర్ణ ఈ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ తరువాత హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్నపూర్ణ మారిపోయింది.
అనేక చిత్రాల్లో స్టార్ హీరోలకు సైతం తల్లిగా నటించింది. అందరికంటే చిరంజీవితో ఎక్కువ సినిమాల్లో తల్లి పాత్రలో కనిపించింది. అలా చాలా సంవత్సరాల తర్వాత 1991లో శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన అసెంబ్లీ రౌడీ చిత్రం లో హీరో మోహన్ బాబుకి తిరిగి అన్నపూర్ణ తల్లిగా నటించారు. ఆ తర్వాత 1992 కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అల్లరి మొగుడు చిత్రంలో మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా హీరో హీరోయిన్లుగా నటించారు. ఇందులో రెండవసారి మోహన్ బాబుకి అన్నపూర్ణ తల్లిగా నటించారు.
1994 లో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్,ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన పుణ్యభూమి నాదేశం చిత్రంలో మోహన్ బాబు, మీనా హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో మోహన్ బాబుకు తల్లిగా మూడవసారి నటించారు. అన్నపూర్ణ ఒకప్పుడు మోహన్ బాబుకి హీరోయిన్ గా నటించి… ఇప్పుడు అదే హీరోకి తల్లి గా నటించడం ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఆమె ఈ మధ్యకాలంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అలా అన్నపూర్ణ రాజా ది గ్రేట్, మహర్షి, నేల టికెట్, అఆ, రాజు గారి గది 2, పేపర్ బాయ్, F2, గద్దల కొండ గణేష్, గీత గోవిందం, సరైనోడు, సాక్ష్యం లాంటి చిత్రాల్లో ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…