పెదాలపై చిరునవ్వులు చిందే రాశి.. కల్మషం లేని మంచి మనిషి.. శుభాకాంక్షలు సినిమాతో తెలుగు పరిశ్రమ పరిచింది ఎర్రతివాచీ.. చక్కని అభినయం అంతకుమించిన వినయం.. అదే కదా మన సంప్రదాయం. చెన్నై లో పుట్టి పెరిగిన రాశి తండ్రిగారు సినీ పరిశ్రమకు చెందిన వారే… తాత గారైతే పద్మాలయ వాహిని స్టూడియోస్ కి జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేసేవాడు. అలా సిని పరిశ్రమలోకి రాశి అడుగుపెట్టడానికి సులువైంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా రావుగారిల్లు సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టింది. హీరోయిన్ గా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం లో జగపతిబాబుతో శుభాకాంక్షలు సినిమాలో నటించింది.
పవన్ కళ్యాణ్ నటించిన గోకులంలో సీత చిత్రంలోని హీరోయిన్ పాత్రకు చిరంజీవి భార్య సురేఖ రాశిని తన ఇంటికి పిలిపించుకొని ఆడిషన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ వదిన గారు చెప్పడంతో రాశిని ముత్యాల సుబ్బయ్య గోకులంలో సీత సినిమాలో హీరోయిన్ గా పెట్టుకున్నారు.ఆ సినిమా మంచి విజయం సాధించింది.
ఆ తర్వాత1998లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి పందిరి మూవీలో అందురాలిగా నటించి ప్రేక్షకులతో జేజేలు కొట్టించుకుంది. 1999 లో SP ప్రొడక్షన్స్, చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో వచ్చిన ప్రేయసి రావే సినిమాలో నటించిన రాశికి నటనాపరంగా మంచి మార్కులు పడ్డాయి. సౌందర్య తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో మంచి సాంప్రదాయబద్ధమైన గృహిణి పాత్రలో రాసి కనిపించారు.
వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, ఆర్తి అగర్వాల్, రాశి హీరో హీరోయిన్లుగా అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత.. ఎందుకనో ఆ సినిమా ఆగిపోయింది ఆ తర్వాత కేరీర్ బాగానే ఉన్నప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు.
ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రంగస్థలంలో రంగమ్మత్త పాత్రకు ముందుగా తనను అప్రోచ్ అయ్యారని.. హీరోయిన్ రాశికి కథ వినిపించడం, ఆమెకు ఆ పాత్ర నచ్చడం కూడా జరిగిపోయాయి. అయితే 1980ల్లో గ్రామీణ మహిళ వేషధారణకు తగ్గట్టుగా మోకాళ్ల దాకా చీర చుట్టుకుని, గ్లామర్ ఒలింకించే సీన్లలో నటించాల్సి ఉండడంతో తాను ఆ ఆఫర్ ని సున్నితంగా వదులుకున్నానని రాశి చెప్పుకొచ్చారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…