Featured

రష్యాలో కొత్త వేరియంట్ దెబ్బకు మళ్ళీ ఆంక్షలు మొదలు..!

ప్రపంచ దేశాలన్నింటికీ పై కరోనా మహమ్మారి వివిధ రూపాలలోకి పరివర్తన చెందుతూ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే భారతదేశంలో వ్యాప్తి చెందిన రెండవ దశ వేరియంట్ ఎంతటి నష్టాన్ని కలుగజేసిందో మనకు తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఈ ప్రభావం నుంచి ఇండియా కోలుకుంటుంది. ఇదిలా ఉండగా రష్యాలో కరోనా వైరస్ మరోసారి రూపాంతరం చెందినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

రష్యా రాజధాని మాస్కోలో నగరంలో కొత్త వేరియంట్ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. ఈ సరికొత్త కొత్త వేరియంట్‌ను మాస్కో లో గుర్తించగా దానికి కూడా ‘మాస్కో వేరియంట్‌’గా నామకరణం చేసారు. రష్యా రాజధానిలో కొన్ని వారాల్లో కేసులు మూడు రెట్లు పెరిగాయి. దీంతో ఆంక్షలు అమలులోకి వచ్చాయి.

కొత్తగా ఏర్పడిన ఈ వైరస్ పై స్పుత్నిక్‌ వి ఎంత వరకు పనిచేస్తుంది అనే విషయంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌ పై స్పుత్నిక్‌ సమర్థవంతంగా పని చేస్తుందనే నమ్మకం ఉందని గమలేయా నేషనల్‌ సెంటర్‌ హెడ్‌ అలెగ్జాండర్‌ గింట్స్‌బర్గ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో మాస్కో నగరంలో శుక్రవారం నాటికీ కొట్టగా 9,056 కేసులు గుర్తించడం జరిగింది. అయితే రెండు వారాల కిందట ఈ సంఖ్య 3వేలు ఉండగా.. 2020లో మొదట్లో కరోనా మహమ్మారి ప్రారంభమైన తర్వాత అత్యధిక సంఖ్యలో ఉన్నాయి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago