Featured

రాం గోపాల్ వర్మ ఊర్మిళతో రిలేషన్‌లో లేకపోయి ఉంటే శ్రీదేవిని పెళ్ళి చేసుకొని ఉండేవాడా..!?

శివ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంటరయ్యాడు రాం గోపాల్ వర్మ. అమీర్ పేట్‌లో ఓ లైబ్రేరీ నడుపుకుంటూ ఉన్న రాం గోపాల్ వర్మ విజయవాడలో తను చదువుకున్న సిద్దార్థ కాలేజీలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకొని చాలా రియలిస్టిక్ ఎలిమెంట్స్‌తో కథ సిద్దం చేసుకున్నాడు. అప్పటి వరకు రాం గోపాల్ వర్మ ఎవరి దగ్గర దర్శకత్వ విభాగంలో పనిచేయలేదు. కానీ సినిమాలను చాలా డీటేయిల్డ్ గా చూశాడు. టేకింగ్ పరంగా కొత్తగా ఎలా చూపించాలి అని ఓ కొత్త విధానాన్ని కనుక్కున్నాడు. కథ నెరేట్ చేయడం దగ్గర్నుంచి షాట్ డివిజిన్ వరకు చాలా పక్కాగా రాసుకున్నాడు.

అన్నపూర్ణ స్టూడియోలో రాం గోపాల్ వర్మ నాన్నగారు పనిచేసేవారు. ఆయనకి నాగార్జున అన్నయ్య అక్కినేని వెంకట్‌తో బాగానే పరిచయం ఉంది. ఆ పరిచయం ద్వారా నాగార్జునకి కథ చెప్పే అవకాశం పొందాడు. నాగార్జున అపాయింట్‌మెంట్ ఇచ్చాడు. వెళ్ళి శివ కథ చెప్పి నాగార్జునని ఒప్పించాడు. కథ నరేట్ చేయడంలోనే నాగార్జున ..రాంగోపాల్ వర్మలోని ఇంటెన్షన్‌ని పసిగట్టాడు. కొత్త టాలెంట్‌ని నాగార్జున ఎంకరేజ్ చేయడంలో అందరికంటే ముందు ఉంటాడు. అలాగే వర్మని ఎంకరేజ్ చేశాడు. చాలా నమ్మకం పెట్టుకొని రాం గోపాల్ వర్మ దర్శకుడిగా శివ సినిమా చేశాడు.

ఈ సినిమా రిలీజయ్యాక ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అప్పటి వరకు టేకింగ్‌లో లేని ఓ కొత్త విధానం అయిన కట్ టు కట్ మేకింగ్ ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురి చేసింది. ఆ సినిమా నుంచే తెలుగు సినిమాలలో టేకింగ్ పరంగా మార్పులు వచ్చాయి. ఇక ఇప్పటి వరకు వర్మ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సంచలన దర్శకుడిగా, వివాదాల దర్శకుడిగా ప్రపంచ వ్యాప్తంగా అసాధారణమైన పేరు సంపాదించుకున్నాడు. బాలీవుడ్‌లో రాం గోపాల్ వర్మకి ఉన్న క్రేజ్ ఎంతటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

రాం గోపాల్ వర్మకి పెళ్ళి అయి ఓ కూతురు ఉంది. అయినా తన మెంటాలిటీకి ఫ్యామిలీ లైఫ్ అడ్డంకి అనే ఆలోచనతో భార్యకి విడాకులు ఇచ్చారు. తన పనేదో తన చూసుకుంటూ ఉన్నాడు. అయితే వర్మకి ఎప్పటికప్పుడు కొత్త పరిచయాలు..కొత్త రిలేషన్స్ కావాలి. అయితే ఎన్ని కొత్త పరిచయాలు..కొత్త రిలేషన్స్ ఉన్నా..అతిలోక సుందరి శ్రీదేవి అంటే మాత్రం అభిమానమే కాదు ఆరాధ్య దైవంగా చూసుకున్నాడు. ఎన్నో సందర్భాలలో కేవలం శ్రీదేవి కోసమే క్షణ క్షణం, గోవింద గోవింద సినిమాలు చేశానని చెప్పుకొచ్చాడు.

ఇక శ్రీదేవి పెళ్ళి చేసుకునే విషయంలో చాలా చర్చలు సాగాయి. ఎక్కువగా శ్రీదేవి.. బోనీకపూర్ పెళ్ళి చేసుకుంటానని చెప్పిన విషయాన్ని వర్మతోనే చర్చించిందని చెప్పాడు. ఒక సందర్భంలో వర్మనే శ్రీదేవిని పెళ్ళి చేసుకోవాలనుకున్నాడని తెలిపాడు. అయితే అదే సమయంలో ఊర్మిళ మండోత్కర్ తో రాం గోపాల్ వర్మ రిలేషన్ షిప్‌లో ఉన్నాడట. అందుకే శ్రీదేని పోగొట్టుకున్నాని చెప్పిన వర్మ.. బోనీకపూర్ ని శ్రీదేవి పెళ్ళి చేసుకోవడం ఎంతమాత్రం ఇష్టం లేదని అభిప్రాయపడ్డాడు. బోనీకపూర్ కి ఆల్రెడి పెళ్ళై డైవర్స్ అయ్యాక శ్రీదేవిని రెండవ పెళ్ళి చేసుకున్నాడు. ఆ సమయంలో శ్రీదేవికి ఉన్న క్రేజ్ అసాధారణం. అందుకే మెజారిటీ భాగం శ్రీదేవిని బోనీకపూర్ పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేనివాళ్ళే. అప్పట్లో ఊర్మిళ – రాం గోపాల్ వర్మ సన్నిహితంగా ఉండకపోయి ఉంటే నిజంగానే శ్రీదేవీ – రాం గోపాల్ వర్మ ఒక్కటై ఉండేవారేమో..

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago