బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రా పోర్న్ ఫిలిమ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తాజగా స్పందించారు బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే. ఈ క్రమమలో ఆమె మాట్లాడుతూ రాజ్ కుంద్రా అరెస్ట్ పై విచారం వ్యక్తం చేసిన ఆమె.. రాజ్ కుంద్రా కుటుంబ సభులు పడుతున్న బాధ తాను అర్ధం చేసుకోగలనని అంటూనే రాజ్ కుంద్రాపై సంచలన కామెంట్స్ చేసారు.
2019 లో ఒక యాప్ లో భాగంగా రాజ్ కుంద్రా కు తనకు ఒప్పందం జరిగింది. ఒక అడల్ట్ కంటెంట్ ఉండే యాప్ ను నా పేరు మీద నడపాలన్నది రాజ్ కుంద్రా ఆలోచన. అయితే ఆ యాప్ నుంచి వచ్చే రెవెన్యూ షేర్స్ లో అనేక అవకతవకలు ఉన్నాయని నేను గుర్తించాను. వెంటనే రాజ్ కుంద్రాతో కుదుర్చుకున్న ఆ ఒప్పందం నేను రద్దు చేసుకున్నాను. అయినా కూడా ఆ యాప్ లో నాకు సంబంధించిన ఫోటోలు, ప్రైవేట్ వీడియోలను నా అనుమతి లేకుండా పోస్ట్ చేశారు. అదేవిధంగా న పర్సనల్ నంబర్ ఆ యాప్ లో పెట్టి నాకు కాల్ చేస్తే నేను మాట్లాడతానని, నగ్నంగా వీడియో కాల్ లో కనిపిస్తానంటూ నా పర్సనల్ నంబర్ ను కూడా యాప్ లో పెట్టారు.
దీనితో ప్రతిరోజు నాకు అనేక కాల్స్, మెస్సేజస్ నా నంబర్ కి వచ్చేవి. ఆ సమయంలో ఆ బాధ భరించలేక విదేశాలకు వెళ్లాను.. అయితే అక్కడ నుంచి తిరిగి వచ్చాక కూడా ఆ వేధింపులకు గురవాల్సి వచ్చింది. వారి బాధ తట్టుకోలేక నంబర్ మార్చాను.. అయితే నంబర్ మార్చిన తరువాత నా కొత్త నంబర్ తో సౌరభ్ కుష్వాన్ కు ఫోన్ చేసి నా ఫోటోలు, వీడియోలు ఆ యాప్ నుంచి తీసేయాలని కోరాను. అప్పటి నుంచి నా కొత్త నంబర్ కూడా యాప్ లో పొందుపరించారు. ఆ నంబర్ కి కూడా అటువంటి వేధింపులు మొదలయ్యాయి అంటూ.. పూనమ్ తన బాధను బయటపెట్టారు. అయితే ఇది వరకే 2019లో పూనమ్ పాండే.. రాజ్ కుంద్రా పై కేసు పెట్టారు. ఆ కేసు ఇప్పటికీ నడుస్తున్నట్టు తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…