పాతబస్తీలో విషాదం చోటుచేసుకుంది. వడ్డీవ్యాపారుల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మెడకు ఉరితాడు బిగించుకుని సెల్ఫీ వీడియోలో మరణ వాగ్మూలం రికార్డు చేసి.. ప్రాణాలు తీసుకున్నాడు. పాతబస్తీ జుమ్మేరాత్ బజార్‌లో మహ్మద్ షాహిద్ హుస్సేన్ అనే యువకుడు కుర్చీల షాపు నిర్వహిస్తున్నాడు. వ్యాపారం నిమిత్తం ఐదుగురు వ్యక్తుల నుంచి కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు. కొన్ని నెలలు వడ్డీ చెల్లించిన హుస్సేన్… ఆర్థిక పరిస్థితి బాగోలేక మూడు నెలలుగా కట్టలేకపోయాడు. దీంతో అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువైందని సమాచారం. వారు తనను చంపేందుకు కూడా కుట్ర చేస్తున్నారని హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియోలో స్పష్టం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…