Featured

శివాజీరాజా కొడుకు కూడా ఒక హీరో అని మీకు తెలుసా..?!

భీమవరం బుల్లోడా పాలు కావాలా మురిపాలు కావాలా..అనే పాట ఈ నటుడిని చూడగానే గుర్తుకువస్తుంది. శివాజీ రాజా తండ్రి భీమవరం బి.ఎన్.ఆర్ కాలేజీలో అటెండర్ గా పనిచేసేవాడు.అదే కాలేజీలో శివాజీ రాజా చదువుకునే వాడు. కాలేజీకి సరిగా వెళ్లేవాడు కాదు. ఎన్.సి.సి ఆక్టివిటీస్ తో పాటుగా కాలేజీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో చురుగ్గా పాల్గొనేవాడు. శ్రేయోభిలాషుల సలహా మేరకు ఆయన హైదరాబాద్ వెళ్లి మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో జాయిన్ కావడం జరిగింది. నటనలో శిక్షణ పూర్తయిన తర్వాత సినిమా అవకాశాల కోసం చెన్నై వెళ్లారు. పాండీ బజార్ లో అద్దెకు ఉంటూ అవకాశాల కోసం దర్శకులను కలుస్తూ ఉండేవాడు.

ప్రముఖ కమెడియన్ ఆలీ,శివాజీ రాజా కలిసి ఒకే గదిలో అద్దెకు ఉండేవారు. 1988 లో అసిస్టెంట్ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణను శివాజీ రాజా కలిసినప్పుడు ఎం.వి.రఘు నూతన నటీనటులతో ఒక కొత్త సినిమా మొదలు పెడుతున్నారు.. దానికి సంబంధించిన ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్పడంతో శివాజీ రాజా ఆయనను కలవడం జరిగింది. అంతకుముందే గొల్లపూడి మారుతి రావు రాసిన కళ్ళు అనే నాటకాన్ని హైదరాబాదులో మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో శివాజీ రాజా ఇతర నటీనటులతో ఆ నాటకాన్ని వేయడం జరిగింది. అలా ఆడిషన్ లో ఉత్తమమైన నటనను ప్రదర్శించడం వలన అప్పటికే ఆ పాత్రకు ఎన్నికైన నటున్ని తొలగించి శివాజీ రాజాను పెట్టుకోవడం జరిగింది. అలా కళ్ళు సినిమాలో మొదటగా ఆయన నటించారు.

ఆ తర్వాత ఆయనకు యాక్సిడెంట్ కావడం వలన కొంత కాలం పాటు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. శివాజీ రాజా కోలుకున్నాక.. హీరోగా అవకాశాలు రాలేదు. ఇంకా ఎక్కువ కాలం వేచి ఉండక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. అలా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బొబ్బిలి రాజా సినిమాలో మొదటగా నటించారు. ఆ సినిమాతో మంచి గుర్తింపు రావడంతో పేకాట పాపారావు,పెళ్లి సందడి పెళ్లి పీటలు, ప్రేమంటే ఇదేరా, జోకర్, నెంబర్ వన్, వినోదం, సిసింద్రీ, ఖడ్గం, సముద్రం, డాడీ, నిన్నే ప్రేమిస్తా, మురారి, ఇలా నటిస్తున్న అటువంటి క్రమంలో ప్రముఖ నటుడు రంగనాథ్ దర్శకత్వంలో మొగుడు పెళ్ళామ్స్ అనే చిత్రంలో శివాజీ రాజా హీరోగా నటించాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా మిగిలిపోయింది.

ఈ మధ్యకాలంలో జైసింహ, విరోధి, మెంటల్ మదిలో, నేనే రాజు నేనే మంత్రి లాంటి చిత్రాల్లో నటించడం జరిగింది. శివాజీ రాజా తన కొడుకును సినిమా రంగంలో రాణించాలని.. వెయిట్ బ్రెయిన్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో, కె.రమాకాంత్ దర్శకత్వంలో వచ్చిన “ఏదైనా జరగవచ్చు”అనే సినిమాలో శివాజీ రాజా కుమారుడు విజయ్ రాజా హీరోగా, పూజ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా మామూలుగా ఆడడంతో..”వేయి శుభములు కలుగు నీకు”అనే కొత్త సినిమాలో విజయ్ రాజా నటిస్తున్నాడు. ఎంతో ఎనర్జిటిక్ ఈజ్ తో నటించే విజయ్ రాజాకు మంచి సినీ భవిష్యత్ ఉండాలని కోరుకుందాం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago