Categories: FeaturedMovie News

నాటి ప్రధానమంత్రి నెహ్రూ పై ఇష్టంతో ఆయనకు నచ్చిన పువ్వు పేరు పెట్టుకున్న అలనాటి హీరోయిన్ ఎవరో తెలుసా..?!

రాజమండ్రి నుంచి ఎంతో మంది కళాకారులు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందిన వారు ఉన్నారు. ఎస్.వి. రంగారావు, అంజలిదేవి, రాజబాబు, రోజారమణి, ఆలీ వీరంతా రాజమండ్రికి చెందిన వారు. మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా రాజమండ్రి కి చెందిన వారే. తండ్రి ఓ విలేఖరి. ఈమెకు ఐదు ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ‘భక్త ప్రహ్లాద’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాలో రోజా రమణి అద్భుతమైన నటనతో ఎస్వీ రంగారావు కూడా ఆశ్చర్య పరిచేలా చేసింది.

ఆ తర్వాత 12 సంవత్సరాల వయసులో.. చైల్డ్ ఆర్టిస్ట్ గా రోజారమణికి అవకాశాలు తగ్గిపోయాయి. ఆ క్రమంలో వారి నాన్నగారు ఇక సినిమాలను విరమించుకోవాలి అనేసరికి రోజారమణికి ఎక్కడ లేని బాధ కలిగింది. అదే సమయంలో ఒక మలయాళం విలేకరి రోజా రమణి నాన్నగారి వద్దకు వచ్చినప్పుడు. కొత్తవాళ్లతో చంభారతి అనే మలయాళ చిత్రాన్ని నిర్మిస్తున్నారని రోజా రమణి అందులో హీరోయిన్ గా నటిస్తుందా అని అడిగాడు. అప్పటికి అటు చైల్డ్ ఆర్టిస్ట్ కాదు ఇటు హీరోయిన్ కాదు అనే వయసులో.. హీరోయిన్ గా నటించడం ఏంటి అని రోజా రమణి ఆశ్చర్యపడింది. ఆ సినిమాలో డిగ్లామర్ రోల్ కావడంతో అంతగా ఇష్టం తో నటించనప్పటికీ.. చంబారతి అనే మలయాళం సినిమా కేరళలో ఓ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది. ఆ తర్వాత రోజా రమణికి దాదాపుగా 35 మలయాళ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది.

అదే సినిమాను తెలుగులో ఓ.ఎస్.ఆర్. ఆంజనేయులు దర్శకత్వంలో లక్ష్మీకాంత్, రోజారమణి హీరో, హీరోయిన్లుగా “కన్నె వయసు” సినిమా వచ్చింది. ఈ సినిమా తెలుగులో కూడా ఘన విజయం సాధించింది. “ఏ దివిలో విరిసిన పారిజాతమో…అనే పాట ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మారు మ్రోగుతూనే ఉంటుంది. ఆ తర్వాత రోజారమణి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి, ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘డ్రైవర్ రాముడు’ చిత్రంలో ఆయనకు చెల్లెలిగా నటించింది. ఈ సినిమాలోని “ఏమని వర్ణించను…అనే అన్నా చెల్లెళ్ల పాట సినిమా విజయానికి మరో కారణం అయ్యింది.

ఆ తర్వాత నటుడు చక్రపాణిని పెళ్లి చేసుకొని హీరో తరుణ్ కు జన్మనివ్వడం తో సినిమాల్లో నటించడం మానుకుంది. కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా హీరోయిన్స్ కి దాదాపు నాలుగు వందలకు పైగా చిత్రాలకు తన వాయిస్ ని అందించింది. అయితే ఆమె తల్లి గారికి ఆ రోజుల్లో నెహ్రూ గారు అంటే చాలా అభిమానం ఉండేది. రోజా రమణి పుట్టడంతో నెహ్రూ కు ఇష్టమైన పువ్వు రోజా కావడంతో రోజా అనిపెట్టి తనకి ఇష్టమైన దైవం వెంకటరమణలోని రమణ కలిపి”రోజారమణి”అని పేరు పెట్టారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago