Featured

సావిత్రి, జెమినీ గణేషన్ లతో నటించిన ఇప్పటి తెలుగు స్టార్ ఎవరో మీకు తెలుసా..?!

అలనాటి మేటి నటీమణులు ఎవరంటే భానుమతీ, సావిత్రి, అంజలి లాంటి పేర్లు గుర్తుకు వస్తాయి. మహానటి సావిత్రి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆమె నటనాభినయం గురించి మహానటి సినిమా ద్వారా అందరికీ తెలిసిపోయింది. తన బాల్యంలో తండ్రి మరణానంతరం కష్టపడి పైకొచ్చిన అతి కొద్దీ నటుల్లో సావిత్రి గారు ఒకరు.

నటన రాదు, డైలాగు చెప్పరాదు అన్న దర్శకులతో నే శభాష్ అనిపించుకున్న నటి సావిత్రి. అనతికాలంలోనే అందనంత ఎత్తుకు ఎదిగి అంతే స్థాయిలో ఆ సినిమాలో సర్పంచ్ భార్యగా ఆమె నటించారు. ఆ సినిమా చూస్తుంటే సావిత్రి ఎంత బలహీనంగా ఉన్నారో మనకి ఇట్టే అర్థం అవుతుంది. ఈ సినిమా తర్వాత ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే ఆమె ‌నటించారు. అదే సినిమాలో మెగాస్టార్ ఒక వేషం వేయడం ఆయన అదృష్టంగా భావిస్తారు. అలా ఆ భార్యాభర్తల్లో సావిత్రితో మొదటగా చిరంజీవి నటించారు.

ఒక రకంగా చెప్పాలంటే సావిత్రి సినిమా ప్రవేశానికి పరోక్షంగా జెమినీ గణేషన్ కూడా కారణంగా పేర్కొనవచ్చు. అలా సావిత్రి తన సినీ మొదటి ప్రయాణం లో చేదోడువాదోడుగా ఉన్న జెమినీ గణేషన్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆయన నిజ స్వరూపం తెలిసిన తర్వాత మెల్లిగా జెమినీ గణేషన్ నుంచి విడిపోవడానికి సావిత్రి ప్రయత్నించారు. ఆ క్రమంలో జెమినీ గణేషన్ స్త్రీలోలుడని ఆమె ఎంతగానో కృంగి పోయారు. ఆ సమయంలోనే సినిమాలు బాగా తగ్గిపోవడం దానితో ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్యం కారణం వలన 1981 లోనే ఆమె మరణించారు.

ఆ తర్వాత 1988 లో నాగేంద్రబాబు నిర్మాతగా, కె.బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి, శోభన హీరో హీరోయిన్లుగా రుద్రవీణ అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రంలో హీరో చిరంజీవికి జెమినీ గణేష్ నాన్నగా బిలహరి గణపతిశాస్త్రి పాత్రను పోషించాడు. తండ్రీ కొడుకులుగా జెమినీ గణేషన్, చిరంజీవి నటించిన తీరు ప్రేక్షకులకు ఉద్విగ్న భరితంగా ఉంటుంది. రుద్రవీణ సినిమా అంతగా విజయం సాధించకపోయినా, ఓ కళాత్మక చిత్రంగా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది.

ఈ సినిమాకు జాతీయ సమైక్యతా చిత్రంగా పురస్కారం దక్కింది. అలాగే హీరో చిరంజీవికి నంది పురస్కారం లభించగా, జాతీయ ఉత్తమ సంగీత దర్శకునిగా ఇళయరాజా అలాగే జాతీయ ఉత్తమ గాయకుడిగా ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం లు జాతీయ అవార్డులు అందుకున్నారు. అలా.. సావిత్రి, జెమినీ గణేషన్ ల ఇద్దరితో నటించే అదృష్టం ఆయనకు దక్కిందని చిరంజీవి ఓ ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago