Featured

సౌందర్య ఎంతో ఇష్టపడి కొనుక్కున్న బంగ్లా ఇప్పుడు ఎటువంటి స్థితిలో ఉందో తెలుసా..?

తెలుగు సినీ ప్రపంచాన్ని కొన్ని సంవత్సరాలపాటు ఏలిన అందాల నటి సౌందర్య హఠాత్మరణం ఇప్పటికి అందరిని కంట తడి పెట్టిస్తుంది. సావిత్రి తర్వాత టాలీవుడ్ ని ఏకచత్రాధిపత్యంగా ఏలిన నటి ఎవరైనా ఉన్నారంటే ఆమె సౌందర్య మాత్రమె.. తెలుగు సినిమాలల్లో నటించడం మొదలు పెట్టి అనాది కాలంలోనే ఆమె టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. అయితే ఆమెకు తోలిసారిగా వచ్చిన సినిమా అవకాశం కూడా చాలా విచిత్రంగా వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణతో “రైతు భారతం” అనే చిత్రం కోసం దర్శకుడు చిట్టిబాబు ప్లాన్ చేస్తున్న సమయంలో మొదట ఆ చిత్రానికి కధానాయికగా వాణి విశ్వనాథన్ ని అనుకున్నారు.

ఆ తరువాత అదే చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం మంచి నటి కావాలని వెతుకుతుండగా, రామయ్య అనే ఎడిటర్ డైరెక్టర్ చిట్టిబాబుకి ఫోన్ చేసి మీరు వెతుకుతున్న నటి బెంగళూరులో ఉందని చెప్పడం జరిగింది. అయితే డైరెక్టర్ చిట్టిబాబు మాత్రం ఆ విషయాన్ని ఎవరికి చెప్పకుండా నేరుగా సౌందర్య ఇంటికి వెళ్లారు. అలా ఎటువంటి మేకప్ లేకుండా ఉన్న ఆమెను చూసి, ఆలస్యం చేయకుండా వెంటనే తన సినిమాలోని రెండో కధానాయిక పాత్రకు ఎంపిక చేసేసారు.

అలా సౌందర్య తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె ఏ రేంజ్ కి ఎదిగిందో అందరికి తెలిసిందే. అప్పట్లో టాప్ హీరోలు అందరూ ఆమెతో నటించాలని భావించేవారట. సౌందర్య డేట్స్ ఖాళీ లేకపోయినా సరే వెయిట్ చేసి మరీ డేట్స్ ఆమెతో సినిమాలు చేసేవారు.

అందంతో పాటు అభినయం కలగలిసిన సౌందర్య తానూ నటించిన పాత్రల్లో తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగోట్టేది. ఇకపోతే సినియర్ నటి ఆమనీ తన స్నేహితురాలు సౌందర్య గురించి ఆమె ఇల్లు గురించి ఈ మధ్య ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

బెంగళూరులో సౌందర్యకి ఒక సొంత ఇల్లు ఉండేది. ఇక ఇప్పుడైతే మరీ బూత్ బంగ్లా గా మారిపోయిందని, దానిని ఎవరూ పట్టించుకోవడం లేదని ఇటీవలే అటువైపుగా వెళ్ళినపుడు చూశాను” అంటూ సౌందర్య ఆ ఇంట్లో ఉన్నప్పటి రోజులు గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు ఆమని.

తను సౌందర్య మరణించిన తరువాత కొన్నాళ్లకు ఆ బంగ్లాకు వెళ్లానని, అక్కడ ఎవరూ లేరని ఆమని పేర్కొన్నారు. అయితే కొద్ది రోజుల కిందట వరకు సౌందర్య తల్లి అక్కడ ఉండేవారని ఆమెని కలుద్దామని అక్కడి వెళితే ఇప్పుడు అక్కడ ఎవరూ కనిపించలేదని, ఆ బంగ్లా పూర్తిగా పాతబడిపోయి చూడటానికి బూత్ బంగ్లాలా కనిపించినట్లు ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా సౌందర్య పేరుతో బయోపిక్ వస్తుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ కోసం కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆమెతో పాటు నిత్యా మీనన్ పేరు కూడా వినిపిస్తుంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago