71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. ప్రతి సంవత్సరం అర్హులైన వారికీ పద్మ పురస్కారాలు ప్రకటిసున్న కేంద్రం ఈ ఏడాది 2020వ సంవత్సరానికి గాను 141 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేయగా, ఇందులో ఏడుగురిని పద్మ విభూషణ్ వరించింది. మరో 16 మందికి పద్మ భూషణ్, 118 మందికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. అయితే ఈ సారి మొత్తం ఐదుగురు తెలుగువారికి పద్మ పురస్కారాలు వరించాయి.
తెలుగుతేజం, భారత బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధుకు భారతదేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్ వరించింది. క్రీడా విభాగంలో ఆమెకు ఈ అవార్డు దక్కింది. పీవీ సింధుకు ఇదివరకే పద్మశ్రీ, రాజీవ్ ఖేల్ రత్న అవార్డులను అందుకున్న సంగతి తెలిసిందే.
అయితే తెలంగాణ నుంచి చింతల వెంకటరెడ్డి (వ్యవసాయం), విజయసారధి శ్రీభాష్యం (సాహిత్యం, విద్య) పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కోటాలో ఎడ్ల గోపాల్ రావు, దళవాయి చలపతిరావుకు పద్మశ్రీ పురస్కారాలు వరించాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…