పేదలకు ఇళ్ల స్థలాల కోసం విశాఖపట్నంలో భూసమీకరణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం పది మండలాలలో 6116. ఎకరాలను తీసుకోవాలని ప్రభుతం అధికారులను ఆదేశించింది. సబ్బవరం, అనకాపల్లి, భీముని పట్నం, ఆనందపురం,పెందుర్తి, గాజువాక, పరవాడ, పద్మనాభం, పెదగంట్యాడ, విశాఖ గ్రామీణ మండలాల్లో ల్యాండ్ పూలింగ్ చేపట్టనున్నారు. దేనికోసం ప్రత్యేక ప్యాకేజి కూడా సిద్ధం చేసింది. అయితే భూసమీకరణలో భాగంగా ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములనే సమీకరించాలని నిర్ణయించారు. అసైన్డ్ భూమి కలిగి ఉన్న వారికీ పరిహారం చెల్లిస్తారు. ఒక ఎకరం అసైన్డ్ భూమి ఇస్తే అందుకు 900 గజాలు డెవలప్ చేసిన భూమిని తిరిగిస్తారు.
ఉగాది సందర్భంగా 25 లక్షల పేదవారికి ఇళ్ల పట్టాల పంపిణీకోసం వైసీపీ ప్రభుతం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. అందుకు ప్రభుత్వ భూములు కేటాయించడంతో పాటు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా స్థలాలను సేకరిస్తోంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములు తమ అధీనంలో ఉంచుకున్న వారి నుంచి కూడా భూములు లాక్కునే పనిలో వున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…