Categories: FeaturedMovie News

సినిమాల్లోకి రాకముందు డైరెక్టర్ వంశీ ఎక్కడ పని చేసేవారో తెలుసా ?

సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే ఎవరివో ఒకరివి అండదండలు ఉండాలి. బంధువులో.. స్నేహితులో..అత్యంత సన్నిహితులో సినిమా ఇండస్ట్రీలో ఉంటే వారి ద్వారా ఇక్కడ దర్శకుడిగానో, హీరోగానో, రచయితగానో..లేక ఇతర 24 విభాగాలలో దేంట్లో ఒకదాంట్లో అవకాశం దొరికి ఎంట్రీ ఇవ్వడానికి వీలవుతుంది. అసలు ఎవరూ లేకపోతే ఇక్కడ ఎంట్రీ అంత సులభం కాదు. కానీ దర్శకుడు వంశీకి మాత్రం కాస్త సులభంగానే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంటరయ్యే అవకాశం దక్కింది. స్వతాహాగా ఆయన మంచి రచయిత. 16 ఏళ్ళకే రాయడం మొదలు పెట్టారు. అది కూడా ఆంధ్ర జ్యోతి పత్రికకు. ఇక్కడ పనిచేస్తున్న సమయంలో ఒకాయన నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు అని మద్రాసు(ఇప్పటి చెన్నై) కి తీసుకు వెళ్ళారు.

ఆయన మద్రాసు చేరుకునే సమయానికే పెద్ద పుస్తకాలు రెండు రాశారట. మంచు పల్లకి, కర్మ సాక్షి అనే పుస్తకాలు. ఈ రెండు తీసుకొని ఓ ప్రముఖ దర్శకుడు దగ్గరికి వెళితే ఆయనకి అనుమానం వచ్చిందట. ఇంత చిన్న కుర్రాడు ఇంత పెద్ద పుస్తకాలు ఎలా రాశాడు అని. ఆ డైరెక్టర్ వి మధుసూధన్ రావుగారు. ఆయనే వంశీకి మొట్టమొదటి గురువు. అయితే అన్ని పాత రెండు రూపాయల నోట్లు ఇచ్చి క్యాసినోలో ఫ్రెండ్స్ అనే సినిమా ఆడుతుంది. అదిచూసి వన్ లైన్ ఆర్డర్ వేసుకొని వారం తర్వాత కనపడమని చెప్పారట. ఆ సినిమా చూసి ఆయన చెప్పినట్టుగానే వన్ లైన్ ఆర్డర్ వేసి ఒక్కరోజులోనే తీసుకు వెళ్ళి కలిశారట.

అది చూసి షాకయిన మధుసూధన రావు గారు వెంటపెట్టుకొని ఎన్.టి.ఆర్ సినిమాకి జాయిన్ చేసుకున్నారట. అది ఆయన అసిస్టెంట్ గా మొదటి సినిమా. ఇక మొదటి క్లాప్ కొట్టింది సీనియర్ ఎన్.టి.ఆర్ మీద. అలా కొంతకాలం ఆయన దగ్గర పనిచేశారు. ఆఖరిగా భారతీ రాజా వద్ద పనిచేసి దర్శకుడయ్యారు. వంశీ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా మంచు పల్లకి. ఇందులో చిరంజీవి సుహాసిని, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో వంశీకి చాలా మంచి పేరు తీసుకు వచ్చి వరుసగా అవకాశాలు వచ్చేలా క్రేజ్ దక్కింది.

ఈ సినిమా తర్వాత ఆలాపన సినిమా తీశారు. అన్వేషణ, సితార, లేడీస్ టైలర్, ప్రేమించు పెళ్ళాడు, డిటెక్టివ్ నారద, మహర్షి, చెట్టుకింద ప్లీడర్ లాంటి సినిమాలు చేశారు. అయితే ఒక సినిమా భారీ హిట్ అయితే ఆ తర్వాత రెండు సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి. ఆ కారణమా లేక వేరేదా తెలీదు గానీ ఆయన మొత్తం కెరీర్ లో పెద్ద హీరోలతో చేసింది ఇద్దరితోనే. వారే చిరంజీవి, మోహన్ బాబు. ఇక ఇండస్ట్రీకి భానుప్రియను పరిచయం చేశారు. ఇక కె విశ్వనాథ్ లాంటి వారి దగ్గర పనిచేసినప్పటికి ఏ దర్శకుడి ప్రభావం ఆయన మీద పడలేదు. ఆయన నవల రాసినా, సినిమా తీసినా ఆయన మార్క్ మాత్రమే ఉంటుంది తప్ప.. ఇతర రచయిత, దర్శకుల ప్రభావం మాత్రం పడలేదు. చాలాకాలం తర్వాత రవితేజ – కళ్యాణి జంటగా నటించిన అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. మళ్ళీ ఆ స్థాయి హిట్ ఈ దర్శకుడికి దక్కలేదు. ఇక ఇండస్ట్రీ మొత్తంలో వంశీకి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago