Categories: FeaturedMovie News

సురేష్ బాబుని హీరో చేయాలనుకున్న రామానాయుడు.. కానీ వెంకటేశ్ ఎందుకయ్యాడో తెలుసా..?

మూవీ మొఘల్ డా.డి. రామానాయుడు సినిమాల మీద ఆసక్తితో మద్రాసు వెళ్ళారు. ఆయన సొంత ఊరైన కారంచేడులో ‘నమ్మిన బంటు‘ సినిమా షూటింగ్ జరిగింది. ఆ సినిమాలోని ఎడ్లపందెం సన్నివేశాలు చిత్రీకరణ జరిగింది. అందులో రామానాయుడు కూడా ఒక సన్నివేశంలో నటించారు. అప్పుడే మీరు సినిమాల్లోకి రావచ్చు కదా.. అని అక్కినేని నాగేశ్వర రావు అడిగారు. ఇప్పుడు నాకు మా వ్యవసాయం తప్ప ఇంకో ఆలోచన లేదని చెప్పారు. రైసుమిల్లు వ్యాపారం మొదలు ఆ పనుల్లో పడ్డారు.

అయితే ఓసారి ఉన్నపలంగా సేల్స్-టాక్స్ వాళ్ళు వచ్చి, బిల్లులు రాయడం లేదని రెండు లక్షల రూపాయలు జరిమానా విధించారు. అప్పట్లో రెండు లక్షలంటే ఎంత ఆస్తో ఊహించుకోవచ్చు. అయితే ఈ సంఘటన రామానాయుడికి వ్యాపారం మీద విరక్తి వచ్చేలా చేసింది. దాంతో నాయుడు గారు మిల్లు ముసివేసి, మద్రాసు వెళ్ళారు. అక్కడ మహాబలిపురం రోడ్డులో కొద్దిగా పొలం కొన్నారు. సాయంత్రం కాస్త కాలక్షేపంగా ఉంటుందని ఆయన తోడల్లుడితో కలిసి ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ కు వెల్తుండేవారు. అక్కడే సినిమావాళ్ళతో పరిచయాలు ఏర్పడ్డాయి.

తండ్రిని ఒప్పించి ‘అనురాగం’ చిత్రాన్ని నిర్మించారు.

ఓ సారి ‘అనురాగం’ చిత్రం మొదలు పెట్టాలని నిర్మాతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే కొద్దిగా పెట్టుబడి తగ్గడంతో ఆ సినిమాకి భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. ఈ విషయం రామానాయుడుకి తెలియడంతో ససేమిరా అన్నా పట్టుపట్టి తండ్రిని ఒప్పించి ‘అనురాగం’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి జి.రామినీడు దర్శకత్వం వహించగా సూపర్ హిట్ అందుకుంది. అయితే అప్పుడు నాయుడుగారు సొంతగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయాలనుకున్నారు. ఆయనే సొంతగా పెట్టుబడి పెట్టి నిర్మాతగా మారాలనుకున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థకి ఏ పేరు పెట్టాలి అని ఆలోచనలో ఉన్నారు. అదే సమయంలో పెద్దకొడుకు సురేష్ బాబుని హీరో చేయాలనుకున్నారు.

కానీ అందరు ఇంటికి పెద్దవాడు కాబట్టి భవిష్యత్తులో సురేష్ బాబు హీరోగా కంటే నిర్మాతని చేస్తే మంచిదని సలహా ఇచ్చారు. రెండవ కొడుకు వెంకటేశ్ ని హీరో చేయాలని సలహాలిచ్చారు. నాయుడుగారికి అత్యంత సన్నిహితంగా ఉండేవారందరు ఇదే సలహా ఇవ్వడంతో పెద్ద కొడుకు సురేష్‌బాబు పేరు మీద సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. 1964లో ఎన్టీఆర్ హీరో గా ‘రాముడు-భీముడు‘ చిత్రాన్ని నిర్మించి సంచలన విజయాన్ని అందుకున్నారు. మొదటి విజయాన్ని అందుకున్న రామానాయుడు వరుసగా సినిమాలు నిర్మించారు. కానీ చుట్టుపక్కలవారిని విపరీతంగా నమ్మడంతో నష్టాల పాలైన ఆయన 1971లో ప్రేమ్‌నగర్ చిత్రాన్ని నిర్మించారు. ‘ప్రేమనగర్‘ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.

టాలీవుడ్‌లో ఇప్పుడు సురేష్ బాబు నంబర్ వన్ ఫిల్మ్ మేకర్.

ఆ తర్వాత నుంచి సురేష్ ప్రొడక్షన్స్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించారు. అంతేకాదు నాయుడు గారు మధ్యమధ్యలో కొన్ని సినిమాలలో కూడా నటించారు. అయితే అనుకున్నట్టు వెంకటేశ్ ని హీరోగా పరిచయం చేశారు. ఈ రోజు వెంకటేశ్ టాలీవుడ్‌లో స్టార్ హీరో. కానీ సురేష్ బాబు మాత్రం ఇప్పటి వరకు వెండితెర మీద కనిపించింది లేదు. నాయుడుగారి తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ బాధ్యతలు తన భుజాల మీద వేసుకున్నారు.

టాలీవుడ్‌లో ఇప్పుడు ఆయన నంబర్ వన్ ఫిల్మ్ మేకర్. కథ చెప్తే హీరో ఎవరో డిసైడ్ చేస్తారు. సీన్ చెప్తే లొకేషన్ ఏదైతే కరెక్ట్ గా ఉంటుందో దర్శకుడికి సూచిస్తారు. అంతేకాదు ఇప్పటి వరకు సురేష్ బాబు నిర్మాణంలో వచ్చిన సినిమాలకి ఓవర్ బడ్జెట్ అయింది లేదు. అంత పక్కాగా తన నిర్మాణ సంస్థను నడుపుతున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago