Categories: FeaturedMovie News

రాం చరణ్ పుట్టినప్పుడు మెగాస్టార్ ఏ సినిమా షూటింగ్‌లో ఉన్నారో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్ హీరోగా మంచి ఫాంలో ఉన్నప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హాస్య నటుడుగా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న అల్లు రామలింగయ్య.. ఆయనని అల్లుడుని చేసుకోవాలనుకున్నారు. అప్పటికే చిరంజీవి నటించిన సినిమాలలో అల్లు రామలింగయ్య కమెడియన్ గా నటించారు. ఆరకంగా ఇద్దరి మధ్యన కూడా ప్రత్యేకంగా ఒకరి మీద ఒకరికి అభిమానం ఏర్పడింది. అదే సమయంలో అల్లు రామలింగయ్యకి తన కుమార్తెకి సంబంధాలు చూడటం ప్రారంభించారట. ఒక రోజు సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక ఇద్దరు కలిసి ఒకే ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నారు.

ఆ సమయంలో అల్లు రామలింగయ్య.. చిరంజీవికి వైన్ ఆఫర్ చేశారట. కానీ చిరంజీవి ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారట. అప్పటికే చిరంజీవి అంటే అల్లు ఆరమలింగయ్య గారికి మంచి అభిప్రాయం ఉంది. ఈ సారి అది రెట్టింపు అయింది. కావాలనే చిరంజీవిని టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ లో చిరంజీవి పాసవడం ఇంట్లో వాళ్ళకి చిరంజీవి గురించి చెప్పడం చక చకా జరిగిపోయాయి. అందరికీ చిరంజీవి అంటే ఇష్టం అయినప్పటికీ అల్లు రామలింగయ్య కొడుకు నేటి అగ్ర నిర్మాత అల్లు అరవింద్ మాత్రం వెంటనే ఒప్పుకోలేదట.

అల్లు అరవింద్ ఎంక్వైరీ చేశాడట..

సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో తనకున్న పరిచయాలతో అంతటా ఎంక్వైరీ చేశాడట. ఒక సందర్భంలో చిరంజీవి సరదాగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక అల్లు అరవింద్ ఎంక్వైరీ చేసిన ప్రతీచోట చిరంజీవి.. గురించి మంచి అభిప్రాయమే వ్యక్తమయింది. దాంతో అల్లు అరవింద్ కూడా చిరంజీవికి తన సోదరిని ఇచ్చి పెళి చేసేందుకు ఒప్పుకున్నారు. ఆ రకంగా అల్లు ఫ్యామిలీకి చిరంజీవి అల్లుడయ్యారు. 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి – సురేఖల వివాహం జరిగింది. ఆ సమయంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమాకి రూ. 50 వేలు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.

Ram charan : రాం చరణ్‌కి పేరు పెట్టింది…తాతగారు అల్లు రామలింగయ్యగారు.

ఇక చిరంజీవికి – సురేఖ దంపతులకి రాం చరణ్ 1985 మార్చ్ 27న జన్మించాడు. ఆ సమయంలో చిరంజీవి ‘పులి’ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత ఆనం గోపాల కృష్ణ దీనికి నిర్మాత. మార్చ్ 27న ఊటీలో షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో చిరంజీవికి ఫోన్ వచ్చిది. మగబిడ్డ పుట్టాడు అని. వెంటనే ఆరోజు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి పరుగు పరుగున తన కొడుకును చూసుకునేందుకు వేళ్ళారు చిరంజీవి. తల్లిపోలికలో ఉన్న చరణ్ ని చూసి చిరంజీవి ఎంతో మురిసిపోయారు. ఆ క్షణంలో చిరంజీవి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.

అల్లు ఫ్యామిలీతో పాటు కొణిదెల ఫ్యామిలిలోనూ పండుగ వాతావరణం నెలకొంది. సంబరాలు జరుపుకున్నారు. రాం చరణ్‌కి పేరు పెట్టింది…తాతగారు అల్లు రామలింగయ్యగారు. ఇక చరణ్ పెద్దవాడై ఇలా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడు అవుతాడని అప్పుడు ఎవరూ ఊహించలేదు. ‘చిరుత’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమయిన చిరు తనయుడు మెగా పవర్ స్టార్ గా ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు. తండ్రికి తగ్గ తనయుడుగా ఇండస్ట్రీలో ..ప్రేక్షకుల్లో ప్రశంసలు అందుకుంటున్నాడు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago