Categories: Uncategorized

హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించే వారి కోసం యూజర్‌ గైడ్‌..అందరికి ఉపయోగం..షేర్ చేయండి..

హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించే వారి కోసం ఎల్‌అండ్‌టీ సంస్థ బుధవారం ‘యూజర్‌ గైడ్‌’ను విడుదల చేసింది.

పది కేజీల బ్యాగేజీ వరకే పరిమితం సులువుగా ప్రయాణించేలా సూచనలు.. సలహాలు.. గ్రేటర్‌ వాసుల కలల మెట్రో జర్నీకి ముహూర్తం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఎల్‌అండ్‌టీ సంస్థ బుధవారం నాడు ‘యూజర్‌ గైడ్‌’ను విడుదల చేసింది. మెట్రో లో ప్రయాణించే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ యూజర్‌గైడ్‌ను ఫాలో కావాలని ఆ సంస్థ సూచించింది. స్టేషన్లు, ఎస్కలేటర్లు, లిఫ్టుల వినియోగంపై పూర్తి వివరాలు స్పష్టంగా వివరించింది. స్టేషన్‌లోకి ఎంట్రీ నుంచి టికెట్‌ కొనుగోలు..రైలులోకి ప్రవేశించడం.. గమ్యస్థానంలో దిగడం వరకు చేయాల్సిన మరియు చేయకూడని పనుల్ని పేర్కొంది. ఈ గైడ్‌ను పరిశీలించడం ద్వారా నగరవాసులు ఎలాంటి ఇబ్బంది పడకుండా మెట్రో జర్నీ చేయవచ్చని ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు ఎండీ శివానంద నింబార్గీ తెలిపారు. ఆ విశేషాలు  చూడండి..

స్టేషన్‌కు ఎలా చేరుకోవడం :

 

► ప్రతి స్టేషన్‌కు రోడ్డు లెవల్‌లో ఎలివేటర్లు, లిప్టులు, మెట్లు, ఎస్కలేటర్లుంటాయి. ఇక మధ్యభాగం నుంచి ప్లాట్‌ఫాం పైకి చేరుకునేందుకు సైతం ఎలివేటర్లు, లిప్టులు, మెట్లు, ఎస్కలేటర్ల వంటి వసతులుంటాయి.

► శారీరక సామర్థ్యం సరిగా ఉన్నవారు మెట్ల మార్గాన్ని వినియోగిస్తే ఇతరులకు అసౌకర్యం ఉండదు.తద్వారా లిఫ్టులు, ఎస్కలేటర్ల వద్ద రద్దీ చాలా తగ్గుతుంది.

ఎస్కలేటర్ల ని ఎలా వినియోగించాలి :

► ఎస్కలేటర్‌ గమనానికి అనుగుణంగా మీ పాదాలను వాటిపై ఉంచి దానిపై నిల్చోవాలి.

► ఎస్కలేటర్‌పై కూర్చోవడం, నడవడం వంటివి చేయడం మంచిదికాదు.

► ఎస్కలేటర్‌పై ప్రయాణించేటప్పుడు రెయిలింగ్‌ను జాగ్రత్తగా పట్టుకొని భద్రంగా నిల్చోవాలి.

► చిన్నారులను చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి.

► చీరలు, దుపట్టాలు ఎస్కలేటర్‌లో చిక్కుపడకుండా ఉండేందుకు జాగ్రత్తలు పాటించాలి.

► గమ్యం చేరగానే ఎస్కలేటర్‌పై నుంచి జాగ్రత్తగా దిగి దూరంగా జరగాలి.

►ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఎస్కలేటర్‌ను నిలిపివేసేందుకు కింద..మధ్య..పైన ఉన్న రెడ్‌బటన్‌ను నొక్కాలి

లిఫ్టులు ఎవరు ఉపయోగించాలి :

► దివ్యాంగులు, వృద్ధులు, అంధుల కోసమే లిప్టులను ఏర్పాటుచేశారని అస్సలు మరవద్దు.

► భారీ లగేజీతో వచ్చేవారు ..చిన్నారులను బేబీ కార్ట్‌లో తీసుకొచ్చేవారు, ట్రాలీ బ్యాగేజి ఉన్నవారు మాత్రమే లిఫ్టులను వినియోగించాలి.

స్టేషన్‌లో ఏమేమి ఉంటాయి :

► స్టేషన్‌ లోనికి, బయటికి ప్రవేశించేందుకు మధ్యభాగంలో నాలుగు వైపులా గేట్లుంటాయి. స్టేషన్‌ను పెయిడ్, అన్‌పెయిడ్‌ అని రెండు ఏరియాగా విభజిస్తారు.

► పెయిడ్‌ ఏరియా: ప్లాట్‌ఫాంను పెయిడ్‌ ఏరియాగా పిలుస్తారు. టిక్కెట్, టోకెన్, స్మార్ట్‌ కార్డున్నవారినే ఈ ప్రాంతానికి అనుమతిస్తారు.

► అన్‌పెయిడ్‌ ఏరియా: స్టేషన్‌ కిందిభాగం(రోడ్‌ లెవల్‌), మధ్యభాగం(కాన్‌కోర్స్‌)లెవల్‌. ఇక్కడ రిటెయిల్‌ దుకాణాలు, స్టోర్లుంటాయి. ఇక్కడికి టిక్కెట్‌ అవసరం లేకుండా ఎవరైనా వెళ్లవచ్చు.

స్టేషన్లలో ప్రయాణికుడికి సూచనలు :

► ప్రతి స్టేషన్‌లో మీరు ప్రయాణించే మార్గానికి సంబంధించి నెట్‌వర్క్‌ మ్యాప్, స్టేషన్‌ లేఅవుట్, లోకల్‌ ఏరియా మ్యాప్, రైళ్ల టైమ్‌టేబుల్, రైళ్ల ఛార్జీల పట్టిక, చేయాల్సిన, చేయకూడని పనులకు సంబందించిన చార్టులుంటాయి.

► ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేందుకు..వారికి దిశానిర్దేశం చేసేందుకు సైనేజి బోర్డులను అన్ని చోట్లా ఏర్పాటు చేశారు.

► అంధులు నేరుగా స్టేషన్‌లోనికి చేరుకునేందుకు వారికి ప్రత్యేక టైల్స్‌తో మార్గం ఏర్పాటుచేశారు. ఈ మార్గంలో వారి చేతికర్ర ఆధారంగా నేరుగా ప్లాట్‌పాం పైకి చేరుకోవచ్చు.

► స్టేషన్లు, ప్రయాణికులకు తెలిసేలా రైళ్ల రాకపోకలపై నిరంతరాయంగా స్టేషన్‌లో అనౌన్స్‌మెంట్‌ వినిపిస్తుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది.

► రైలులోపల అత్యవసర కాల్‌బటన్‌ ఉంటుంది. ఏదైనా ఆపత్కాలంలో ఈ బటన్‌ నొక్కడం ద్వారా ట్రైన్‌ ఆపరేటర్‌ను సంప్రదించవచ్చు.

టికెట్‌లు, టోకెన్‌, స్మార్ట్‌ కార్డ్‌ ఇలా కొనుగోలు చేయండి :

►మెట్రో రైళ్లలో అప్పుడప్పుడూ ప్రయాణించేవారికి ఉపయుక్తంగా ఉండేందుకు టోకెన్‌లు ఉంటాయి.

►స్టేషన్‌ మధ్యభాగం(కాన్‌కోర్స్‌)వద్ద టికెట్‌ ఆఫీస్‌ మెషిన్‌(టీఓఎం) వద్ద వీటిని కొనుగోలుచేయాలి.

►టిక్కెట్‌ విక్రయ యంత్రం వద్ద టిక్కెట్‌లు తీసుకోవాలి. టోకెన్‌ యంత్రం వెనకాలే టికెట్‌ విక్రయ యంత్రం కూడా ఉంటుంది.

►టిక్కెట్లు, టోకెన్ల గోల లేకుండా స్మార్ట్‌ కార్డ్‌తో జర్నీ చేసేందుకు స్మార్ట్‌ కార్డ్‌ నెబ్యులా మీకు ఉపయోగపడుతుంది.

►ప్రతి స్టేషన్‌ మధ్యభాగంలో ఏర్పాటు చేసిన టికెట్‌ ఆఫీస్‌ మెషిన్‌ వద్ద వీటిని మీరు కొనుగోలు చేయవచ్చు.

►ఎల్‌అండ్‌టీ మెట్రోరైల్‌ వెబ్‌సైట్‌ ద్వారా కూడా వీటి కొనుగోలుకు ఆన్‌లైన్‌ చెల్లింపులకు డెబిట్, క్రెడిట్‌ కార్డులను కొనుగోలు చేయాలి.

స్టేషన్‌లో దిగిన తరవాత…

► స్టేషన్‌ బయటికి వెళ్లే చోట ఉన్న మ్యాప్‌ను పరిశీలించాలి. తద్వారా మీరు ఎక్కడికి ఎలా వెళ్లాలన్న విషయం
మీకు స్పష్టమౌతుంది.

► ఎగ్జిట్‌ గేట్‌ గుండా బయటికి వెళ్లే సమయంలో మీ వద్దనున్న స్మార్ట్‌కార్డ్, టిక్కెట్‌ లేదా టోకెన్‌ వారికి చూపాల్సి ఉంటుంది.

► స్టేషన్‌ కిందిభాగం(రోడ్‌లెవల్‌)లో పాదచారుల మార్గాలు, ఫుట్‌పాత్‌లుంటాయి.

► ఇక్కడ సైకిల్‌లు అద్దెకు తీసుకునే సౌకర్యం ఉంటుంది.

► బస్సులు, షెటిల్‌ బస్సులు, క్యాబ్‌లు, ఆటోలు నిలిపే అవకాశం ఉంటుంది.

వివరాలకు ఈ వీడియో చూడండి..

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago