రియల్ స్టార్ శ్రీహరి ప్రస్తుతం మన మధ్య లేకున్నా.. ఆయన్ను తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రం ఏనాటికీ మరిచిపోదు. ఎందుకంటే.. ఆయన ఒక రియల్ స్టార్ గానే కాకుండా.. సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండేవారు. రియల్ స్టార్ గా పేరు రావడం.. సినిమాల్లో స్టార్ హీరోగా ఎదగడం వరకే మనకు తెలుసు. కానీ.. శ్రీహరి బాల్యం, ఆయన సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి పడ్డ కష్టం చాలామందికి తెలియదు.
శ్రీహరిది హైదరాబాద్ లోని బాలా నగర్. చిన్న వయసు నుంచే చాలా కష్టపడ్డారు శ్రీహరి. వాళ్లది దిగువ మధ్య తరగతి కుటుంబం. హైదరాబాద్ లోని శోభన థియేటర్ పక్కనే శ్రీహరి నాన్నకు సంబంధించిన షెడ్డు ఉండేదట. రోజూ శోభన థియేటర్ లో వచ్చే సినిమాలు చూడటం శ్రీహరికి చిన్నప్పటి నుంచే అలవాటు అయిందట. రోజూ శోభన థియేటర్ లో పాలు పోయడం వల్ల.. థియేటర్ సిబ్బంది శ్రీహరికి పరిచయం అయ్యారు. దీంతో రోజూ థియేటర్ కు వెళ్లి ఉచితంగా సినిమా చూసేవారట శ్రీహరి.
థియేటర్ లో హీరోల కటౌట్లు చూసి హీరో కావాలనుకున్న శ్రీహరి
ఏదైనా కొత్త సినిమా విడుదల అయితే.. శోభన థియేటర్ లో హీరోల కటౌట్ లు పెట్టేవారు. ఆ కటౌట్లు చూసి.. తాను కూడా ఏదో ఒకరోజు హీరో అయి తన కటౌట్ ను థియేటర్ లో ఏర్పాటు చేయించుకోవాలని శ్రీహరి బాగా కలలు కనేవారట. కానీ.. ఆయనది పేద కుటుంబం కావడంతో ఎలా హీరో అవ్వాలి? అని ఎంతో ఆలోచించేవారట శ్రీహరి. అయితే.. మనకు ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉండాలి. ఏదో ఒక టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో గుర్తింపు లభిస్తుందని శ్రీహరి భావించారట.
జిమ్నాస్టిక్స్ ట్రెయినింగ్ ప్రారంభించిన శ్రీహరి
సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్స్ లో తన ఫ్రెండ్ సాయంతో అక్కడ జిమ్నాస్టిక్స్ ట్రెయినింగ్ తీసుకోవడం ప్రారంభించారు శ్రీహరి. జిమ్నాస్టిక్స్ నేర్చుకొని.. స్టేట్ లేవల్, నేషనల్ లేవల్ గేమ్స్ ఆడి.. తనకంటూ ప్రత్యేక అభిమానం సంపాదించుకున్నారు శ్రీహరి. అలా.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాక సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు శ్రీహరి.
దాసరి నారాయణరావే శ్రీహరికి తొలి గురువు
శ్రీహరిని వెండి తెర మీద పరిచయం చేసింది దాసరి నారాయణ రావు. బ్రహ్మనాయుడు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి శ్రీహరి అడుగు పెట్టారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యాక.. దాసరి దగ్గరే శ్రీహరి ఓ నాలుగు ఐదు ఏళ్ల పాటు శిష్యుడిగా ఉన్నారు. ఆ సమయంలోనే శ్రీహరి… సినిమాలకు సంబంధించిన అన్ని స్కిల్స్ సాధించారు. తొలినాళ్లలో శ్రీహరికి.. హీరో కంటే కూడా విలన్ వేషాలే ఎక్కువగా వచ్చాయి. ఏ వేషం వచ్చినా కూడా వెంటనే ఒప్పుకొని అన్ని వేషాలు వేసి.. ఆ తర్వాత రియల్ స్టార్ గా ఎదిగారు శ్రీహరి. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హీరోగా ఆయన కెరీర్ లో ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఆయనకు బాగా పేరు తెచ్చిన సినిమా మాత్రం మగధీర. శ్రీహరి.. సినిమాల్లో బిజీగా ఉంటూనే.. ఎన్నో సోషల్ సర్వీసెస్ చేశారు. ఒక ఊరును కూడా దత్తత తీసుకున్నారు. కానీ.. దురదృష్టవశాత్తు శ్రీహరి.. అనారోగ్యం కారణంగా ఈ లోకాన్ని విడిచి పోవడం.. సినీ ఇండస్ట్రీకి తీరని లోటును మిగిల్చి వెళ్లిపోయారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…