Featured

1980 Hero’s Remunaration : అప్పట్లో మన టాలీవుడ్ అగ్ర హీరోలు ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకొనే వారో తెలుసా..?

1980 Hero’s Remunaration : హీరో మార్కెట్ ను బట్టి రెమ్యూనరేషన్, సినిమా బడ్జెట్ లు ఉంటాయి. ప్రస్తుతం మన టాలీవుడ్ లో హీరోలు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. సినిమాలలో హీరో ఎలివేషన్, బడ్జెట్, రెమ్యూనరేషన్ లలో ఎక్కడా తగ్గట్లేదు. నిర్మాతలు కూడా వారు ఎంత అంటే అంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్దపడుతున్నారు. అయితే ఈ పదేళ్లలోనే ఇంతకుముందు లేనంతగా రెమ్యూనరేషన్లు పెరిగాయి. ప్రస్తుతం కోట్లలో రెమ్యూనరేషన్లు వినిపిస్తుంటే 1980 లలో మన అగ్ర హీరోల రెమ్యూనరేషన్ సినిమా బడ్జెట్లు ఎంత ఉన్నాయో చూద్దాం.

సీనియర్ ఎన్టీఆర్

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు మూల పురుషుడు ఎవరంటే టక్కున వినిపించే పేరు మాత్రం నందమూరి తారక రామరావు గారిదే. సాంఘిక, పౌరానిక, జానపద చిత్రాలు ఏవైనా అయన తరువాతే ఎవరైనా. అయితే అప్పట్లో ఎన్టీఆర్ సినిమా బడ్జెట్ వేసే సెట్ ను బట్టి 40 నుండి 50 లక్షలు ఉండేదట. ఇందులో అయన రెమ్యూనరేషన్ దాదాపు 12 లక్షల వరకు వుండేదని సమాచారం. అయన సినిమా విడుదల అయితే కోటి నుండి మూడు కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టేవట.

ఏఎన్ఆర్…

అప్పట్లో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈయన నటించే సాంఘిక చిత్రాలకు 30 లక్షల వరకు బడ్జెట్ ఉండేదట. అయితే దీనిలో ఈయన 10 లక్షల రెమ్యూనరేషన్ తీసుకొనేవారని సమాచారం.

సూపర్ స్టార్ కృష్ణ

ఇండస్ట్రీ కి కొత్తగా ఏదైనా పరిచయం అయ్యింది అంటే అది సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాతోనే అని పేరు. ఈయన సినిమాకు అప్పట్లో 20 నుండి 25 లక్షల బడ్జెట్ ఉంటే అందులో అయన రెమ్యూనరేషన్ 7 లక్షలు. ఈయన నిర్మాతల హీరో. ఒకవేళ సినిమా ప్లాప్ అయితే వెంటనే ఆ నిర్మాతకు మరో సినిమాకు డేట్స్ ఇచ్చేవారట.

శోభన్ బాబు

ఇక తెలుగు ఇండస్ట్రీ సోగ్గాడు ఈయన. శోభన్ బాబు సినిమా బడ్జెట్ 20 లక్షల వరకు ఉండేదట. అందులో శోభన్ బాబు రెమ్యూనరేషన్ 6 లక్షల నుండి 7 లక్షల వరకు తీసుకునేవారట.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago