Categories: FeaturedMovie News

ఈ దుష్టత్రయం ఉన్న ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ కావలసిందే.!!

సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్ లు విచిత్రంగా కలుస్తూ ఉంటాయి. ఈ కాంబినేషన్ యాదృశ్చికమా రచయిత కావాలని ఈ‌ కాంబినేషన్ కలుపుతారా అన్నది అర్థం కాదు. ఒకసారి ఇలాంటి కాంబినేషన్ సెంటిమెంట్ గా అనేక సందర్భాల్లో వర్క్ ఔట్ అవుతుంది. కావున దర్శకనిర్మాతలు కావాలనే మళ్లీ మళ్లీ అలాంటి కాంబినేషన్ని తిరిగి తమ కొత్త సినిమాల్లో పునరావృతం చేస్తూ ఉంటారు.

రావు గోపాలరావు, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య ఈ ముగ్గురే దుష్ట త్రయం. వీరి కలయికలో వచ్చిన ఏ సినిమా అయినా ఘన విజయం సాధిస్తుంది.

1977లో శ్రీ పల్లవి ఫిలిమ్స్ ప్రొడక్షన్స్ లో తాతినేని రామారావు దర్శకత్వంలో ఎన్టీరామారావు జయప్రద హీరో హీరోయిన్లుగా యమగోల సినిమా వచ్చింది. కైకాల సత్యనారాయణ యముడిగా కనిపించగా, అల్లు రామలింగయ్య చిత్రగుప్తుని గా కనిపించారు. జయప్రద తండ్రిగా, విలన్ గా రావు గోపాలరావు కనిపించారు. ఈ దుష్ట త్రయం తో సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.

1979లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీ రామారావు శ్రీదేవి హీరోహీరోయిన్లుగా వేటగాడు సినిమా వచ్చింది. ఆకు చాటు పిందె తడిసే.. కొమ్మ చాటు పువ్వు తడిసే.. అనే పాట ఎంతగా హిట్టయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రావు గోపాల్ రావు, సత్యనారాయణ తండ్రీకొడుకులుగా, వారికి సహాయకుడిగా అల్లు రామలింగయ్య నటించారు. ఈ దుష్ట త్రయం మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

1986లో విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ లో ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కృష్ణ శ్రీదేవి హీరోహీరోయిన్లుగా ఖైదీ రుద్రయ్య సినిమా విడుదలయ్యింది. లారీల్లో దొంగ సరుకు రవాణా చేసే విలన్ గా పణిభూషన్ రావు పాత్రలో రావు గోపాల్ రావు నటించగాఅతని కొడుకుగా అమాయక పాత్రలో కైకాల సత్యనారాయణ, కృష్ణ చెల్లెలి మావయ్య పాత్రలో అల్లు రామలింగయ్య గారు నటించారు. ఈ ముగ్గురు నటించిన సినిమా కూడా విజయాన్ని సాధించింది.

1989లో గీతా ఆర్ట్స్ ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి హీరోహీరోయిన్లుగా అత్తకి యముడు అమ్మాయికి మొగుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చక్రవర్తి స్వరపరిచిన మెరుపుల ఆడతా పిడుగుల రేగుతా.. పాటకి చిరంజీవి తన బ్రేక్ డాన్స్ తో అదరగొట్టాడు. అంతస్తు, ఐశ్వర్యం ఉన్నాయని పొగరుతో ప్రవర్తించే వాణిశ్రీకి జైలు నుంచి విడుదలైన నేరస్తులుగా.. రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య నటించగా, వాణిశ్రీ భర్తగా కైకాల సత్యనారాయణ నటించారు. ఈ దుష్టత్రయం నటించిన ఈ సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్ నే సాధించింది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago