బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు.. చిట్టి పొట్టి పలుకుల ముద్దుమాటలే మా ధనధాన్యాలు.. అనే పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి ఏ సమయంలో రాశాడో గాని అది ఈ బుడ్డోడికి సరిగ్గా సరిపోతుంది.పడుతూ లేస్తూ పాలు తాగే ఒక సంవత్సరపు వయసులో అఖిల్ సిసింద్రీ సినిమాతో బాక్సాఫీస్ దుమ్ము దులిపాడు.
శివ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన శివ నాగేశ్వరరావు బేబీస్ డే అవుట్ అనే ఇంగ్లీష్ సినిమా చూసి ఎంతో ప్రేరణ పొందాడు. ఆ సినిమాని కొన్ని మార్పులతో తెలుగులో తీయాలనుకున్నారు.ఆ క్రమంలో తన గురువుగారు రామ్ గోపాల్ వర్మ ను సంప్రదించగా ఆర్జివి నాగేశ్వరరావును ప్రోత్సహిస్తూ బాగుంటుంది తెలుగులో చేయండి అని సూచన ఇచ్చారు.
అలా ఒక సందర్భంలో శివ నాగేశ్వరరావు ఒక మ్యాగజైన్ లో నాగార్జున అమలతో ఉన్న అఖిల్ చిన్నప్పటి ఫోటోను చూడడం జరిగింది. ఈ బుడ్డోడు చాలా క్యూట్ గా ఉన్నాడని నాగార్జున గారి ఇంటికి వెళితే అమలా దానికి నో చెప్పింది. అప్పుడు శివనాగేశ్వరరావు తిరిగి నాగార్జునను సంప్రదించగా ఆయన బాగా ఆలోచించి చివరికి ఒప్పుకున్నారు.
సిసింద్రీ సినిమా లో తల్లి పాత్రకు అమలగారు ఒప్పుకోలేదు. అలా ఆ పాత్ర ఆమని కి వెళ్ళింది. సినిమాలో స్టార్ ఇమేజ్ కొరకు జగపతిబాబు, రాజశేఖర్ లను ఇందులో నటింపచేయాలని అనుకున్నా చివరికి తన కొడుకుదే ప్రధాన పాత్ర కాబట్టి తనే నటించడం కరెక్ట్ గా ఉంటుందని నాగార్జున ఈ సినిమాలో నటించారు. పూజాబత్ర, టబు ఇద్దరూ ఎలాంటి పారితోషికం లేకుండా ఈ సినిమాలో నటించడం ఒక విశేషం.
అఖిల్ తల్లిదండ్రుల పాత్ర లో శరత్ బాబు ఆమని నటించగా కొన్నిదృశ్యాల్లో శరత్ బాబు, ఆమని లకు అఖిల్ స్పందించకపోవడంతో అఖిల్ ముందు ఆమని నాగార్జున ఉండగా కెమెరా వారి వెనుక నుంచి షూట్ చేయడం జరిగింది. మరో సందర్భంలో లో అఖిల్ తో రోడ్డు మీద చిత్రీకరిస్తున్నప్పుడు అఖిల్ ఏడ్చే సీన్ ఒకటి ఉంటుంది. అఖిల్ ఎంతకు ఏడవకపోవడంతో అమల గారు అక్కడికి వచ్చి కారులో వెళ్లిపోతుంటే అఖిల్ ఏడవడం ప్రారంభించాడు. దానిని షూట్ చేసుకున్న తర్వాత తిరిగి అమల అఖిల్ దగ్గరికి వచ్చి ఓదార్చడం జరిగింది.
ఇలా దాదాపు సినిమాని రామానాయుడు, పద్మాలయ, సారథి స్టూడియోలో సెట్లు వేసి దాదాపు కోటి 50 లక్షలతో 75 రోజుల్లో సినిమా పూర్తి చేశారు. 1995 సెప్టెంబర్ లో సినిమా విడుదలైంది. ఈ బుడ్డోడికి ఏకంగా ఒక పెద్ద కటౌట్ కట్టారు. ఇంత చిన్న వయసులో కటౌట్ కట్టడం ఒక రికార్డ్. సిసింద్రీ సినిమా ఏకంగా ఆరు కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెట్టింది. ముందుగా ప్రామిస్ చేసినట్టు అమలకి బ్లూ క్రాస్ సొసైటీ నడపడానికి గాను బంజారాహిల్స్ లో ఒక బిల్డింగ్ నాగార్జున కొని ఇవ్వడం జరిగింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…