కొందరు హీరోయిన్స్ చాలా తక్కువ సినిమాలలో నటించినా కూడా ప్రేక్షకుల మదిలో బాగా గుర్తుండి పోతారు అలా గుర్తుండి పోయే హీరోయిన్ సోనియా అగర్వాల్. దాదాపు 16 సంవత్సరాల క్రితం వచ్చిన 7/G బృందావన కాలని చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సోనియా అగర్వాల్.
ఆ చిత్రం కన్నా ముందు అబ్బాస్, వినీత్ లు హీరోలుగా నటించిన ‘నీ ప్రేమకై’ చిత్రంలో చిన్న పాత్రలో నటించినా కూడా మంచి గుర్తింపునే సంపాదించుకుంది. ఆ తర్వాత జగపతి బాబుతో ‘థమ్’ అనే చిత్రంలో నటించింది. కానీ., ఈ చిత్రం అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో ఈమెకు పెద్దగా క్రేజ్ రాలేదు. ఈవిధంగా సోనియా సినిమా కెరీర్ ను గమనిస్తే.. మొత్తానికి ఆమెకు 7/జి బృందావన కాలనీ చిత్రం పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రం తర్వాత మళ్లీ తెలుగులో ఎక్కువగా కనిపించని ఈ ముద్దుగుమ్మ ఆమధ్య ‘టెంపర్’ చిత్రంలో అలా తళుక్కున మెరిసి మాయమై పోయింది.
తాజాగా సోనియా అగర్వాల్ రెండో పెళ్ళికి సిద్దమౌతుందనే రూమర్స్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్న నేపధ్యంలో తన మొదటి పెళ్ళి విడాకుల వరకూ ఎందుకు దారి తీసిందో.. అందుకు గల కారణాలను సోనియా మీడియా ముందు చెప్పుకొచ్చింది. ‘7/జి బృందావన కాలనీ చిత్రంలో అనిత పాత్రలో తనని పరిచయం చేసిన ఆ చిత్ర దర్శకుడు సెల్వ రాఘవన్ ని ప్రేమించి 2006లో పెళ్లి చేసుకుంది సోనియా. కొన్నాళ్ళ పాటు బాగానే వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. అయితే ఆ తర్వాత కెరీర్ విషయంలో ఇద్దరిమధ్యా అభిప్రాయబేధాలు రావడంతో 2010లో వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. కానీ ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్ గానే కలిసే ఉంటున్నారని తెలియజేసింది సోనియా.
సెల్వ రాఘవన్ తో విడాకులు తీసుకున్న తర్వాత సోనియా.. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘విన్నర్’ చిత్రంలో నటించింది. ప్రస్తుతం రామ్ హీరోగా కిశోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘రెడ్’ చిత్రంలో కూడా ఓ ముఖ్య పాత్రలో సోనియా నటిస్తునట్లు తెలిసింది. సెల్వ రాఘవన్ తో విడిపోయిన తర్వాత ఒంటరిగానే వుంటున్న సోనియా అగర్వాల్ త్వరలో మరో పెళ్లికి సిద్ధమవుతున్నట్టు సోషల్ మీడియాలో రూమర్స్ షికారు చేయడంతో ఆ రూమర్స్ లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పేసింది సోనియా. యువతరం మెచ్చే మంచి ఫీల్ వున్న ప్రేమకధతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రేమకధ ఎందుకు ఫెయిల్ అయ్యిందో లోగుట్టు పెరుమాళ్ళుకెరుక..!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…