ప్రభుత్వాలు మహిళలపై జరుగుతున్న దాడుల పట్ల ఎన్నో చట్టాలు చేస్తున్నప్పటికీ మానవమృగాలు మాత్రం రోజురోజుకు రెచ్చిపోయి చిన్నపిల్లలు పండు ముసలి వాళ్ళు అని తారతమ్యం లేకుండా మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.ఇలా అత్యాచార ఘటనలకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షిస్తున్నప్పటికీ ఏమాత్రం భయం లేకుండా కొందరు మానవ మృగాలు అదేస్థాయిలో రెచ్చిపోయి అత్యాచారానికి పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
వారం రోజుల క్రితం జరిగిన హైదరాబాద్ ఘటన మరవకముందే అలాంటి ఘటన ఆగ్రాలో మరొకటి చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని ఎనిమిదేళ్ల చిన్నారిపై కామాంధులు అత్యాచారం చేసి ఆపై చంపిన ఘటన ఆగ్రాలోని అలీఘర్‌లోని టప్పల్ ప్రాంతంలో ప్రాంతంలో చోటు చేసుకుంది.
స్థానిక కథనం ప్రకారం… ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వరి పొలంలో స్కూల్ యూనిఫామ్ కనిపిస్తుండడంతో స్థానికులు ఆ వరిపొలంలోకి వెళ్లిచూడగా ఎనిమిదేళ్ల చిన్నారి అచేతనంగా పడి ఉండటం చూసి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు.
అయితే ఉదయం 9 గంటల సమయంలో బాలిక పాఠశాలకు వెళ్లిందని, అయితే ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వరి పొలంలో మధ్యాహ్నం బాలిక శవమై కనిపించదని బాలిక బంధువులలో ఒకరు తెలిపారు. బాలిక మృతదేహం ఉన్న చోట నుంచి 100 మీటర్ల దూరంలో తన స్కూల్ బ్యాక్ పడి ఉందని, ఆ బాలిక స్కూలుకు రాలేదని ఉపాధ్యాయులు చెప్పినట్లు పోలీసులు తెలియజేశారు. అయితే పాపను ఎవరో అత్యాచారం చేసి చంపేసి ఉంటారని నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…