General News

సెకండ్ హ్యాండ్ కారు శుభ్రం చేస్తుండగా.. 9 ఏళ్ళ బాలుడికి వరించిన అదృష్టం!

సాధారణంగా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పనికి తగ్గ ప్రతిఫలం ఆశిస్తాము. ఈ క్రమంలోనే ఆ పనికి తగ్గ ఫలితం లభించడంతో పాటు మన పనికి బహుమతులు ప్రకటిస్తే వచ్చే సంతోషం మాటలలో చెప్పలేనిది. అలాంటి సంతోషంలోనే తొమ్మిది సంవత్సరాల బాలుడులాండన్ మెల్విన్ మునిగి తేలుతున్నాడు. ఇంతకీ లాండన్ సంతోషం వెనుక ఉన్న కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

అమెరికాలోని ఇండియానాకు చెందిన లాండన్.. తన తండ్రి సెకండ్ హ్యాండ్ కారు శుభ్రం చేస్తున్న సమయంలో ఫ్లోర్ పై ఒక కవర్ పడిపోయింది. ఆ కవర్ చూసిన లాండన్ తనకి ఏదో కొత్త వస్తువు దొరికిందని వెంటనే ఆ కవర్ తీసుకొని తన తండ్రి దగ్గరకు వెళ్లాడు. అయితే తన తండ్రి మైకేల్ మెల్విన్ తన కొడుకు తెచ్చిన ఎన్వలప్ కవర్ ను పెద్దగా పట్టించుకోలేదు. కానీ లాండన్ మాత్రం తన తెచ్చిన కవర్ తెరిచి చూడాలని పదేపదే విసిగిస్తున్నడంతో మైకేల్ చివరికి కవర్ తెరిచి చూసి ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

తన కొడుకు తెచ్చిన ఎన్వలప్ కవర్ లో పెద్ద మొత్తంలో డబ్బు ఉండడం చూసి మైకేల్ ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని తన భార్యకు తెలియజేశారు. భార్యభర్తలిద్దరు ఆ కవర్ లో ఉన్న డబ్బులు మొత్తం లెక్కించగా సుమారు ఐదు వేల డాలర్లు అనగా రూ.3.5 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. ఈ డబ్బులతో పాటు మరి కొన్ని చెక్ లు కూడా ఉన్నాయి. ఈ విధంగా దొరికిన డబ్బు తమది కాదని భావించిన ఆ దంపతులు ఆ డబ్బులను అసలైన యజమానులకు తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకుంది.

మైకేల్ గత ఏడాది సెప్టెంబర్లో ఆ కారును దక్షిణ కారోలినాకు చెందిన ఓ కుటుంబం నుంచి కొనుగోలు చేశారు. 2019లో పాత యజమానులు ఫ్లోరిడాకు ప్రయాణించినప్పుడు ఈ డబ్బును కవర్లో పెట్టి మర్చిపోయినట్లు గుర్తించారు. వెంటనే వారికి సమాచారం అందించి తమ డబ్బును తీసుకోవాల్సిందిగా మైకేల్ తెలియజేశారు. ఎంతో కష్టపడి తమ డబ్బును కనిపెట్టి వెనక్కి ఇస్తుండడంతో యజమానులు లాండన్ 1000 డాలర్లు తీసుకుంటేనే వారు తమ డబ్బులు తీసుకుంటామని చెప్పడంతో లాండన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ డబ్బుతో తనకు నచ్చిన వస్తువులను కొనుక్కోవాలని లాండన్ ఒక జాబితాను తయారు చేశాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

18 hours ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

18 hours ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

18 hours ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

18 hours ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

18 hours ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

18 hours ago