తెలుగు బుల్లితెరపై మల్లెమాల సమస్థ నిర్వహిస్తున్న జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతో క్రేజ్ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే కమెడియన్ లకు ఈ కార్యక్రమం ద్వారా ఎంతో ఆదరణ లభించింది. బుల్లితెర నుంచి వెండితెరపై నటించే అవకాశాలు కల్పించింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో సందడి చేసే కొందరు కమెడియన్లు తరుచు పలు వివాదాస్పద కేసుల్లో ఇరుక్కున్నారు. గతంలో జబర్దస్త్ నటుడు వ్యభిచార కేసులో ఇరుక్కోగా తాజాగా మరొకరు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్న ఘటన చోటు చేసుకుంది.
జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న హరి ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో బుక్ అయినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా శేషాచలం అడవులలో కూంబింగ్ నిర్వహిస్తున్న అటవీ అధికారులు ఎనిమిది మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు.వీరి నుంచి రెండు నాటు తుపాకులు మూడు లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలోనే అరెస్టయిన నిందితులను ఆరా తీయగా ఈ స్మగ్లింగ్ కేసులో నటుడు హరికి సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. గతంలో కూడా నటుడు హరి పై కేసులు, స్మగ్లింగ్ కేసులు కూడా ఉన్నాయని పోలీసులు తెలియజేశారు. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన నటుడు హరి తనకు ఈ స్మగ్లింగ్ కు ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు. ఈ విధంగా ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ పై గతంలో తను పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల తను ప్రతీకారంగా ఇప్పుడు తనపై ఈ విధంగా తప్పుడు కేసులు పెడుతూ, తనని ఒక స్మగ్లర్ గా ఆరోపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…