Categories: General News

Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… రిపెరులో ఉన్న మిని లారీనీ తరలిస్తుండగా ప్రమాదం….ముగ్గురు మృతి!

Road Accident: ఈ మధ్య కాలంలో దేశంలో ప్రతిరోజు వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.మునుపటి కాలంలో ఎక్కడికైనా వెళ్లాలంటే బస్సులు ట్రైన్లు ఎక్కి వెళ్లేవారు. కానీ ప్రస్తుత కాలంలో మనిషికి ఒక వాహనం తప్పనిసరి అయిపోయింది. ఒక విధంగా వాహనాల సంఖ్య పెరగటం కూడా ప్రమాదాలకు కారణం. అంతేకాకుండా వాహనాన్ని నడిపే వ్యక్తులు అజాగ్రత్త వల్ల ,నిర్లక్ష్యం వల్ల ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకొని ఎంతో మంది నిర్ధాక్షణ్యంగా ప్రాణాలు కోల్పోతున్నారు.

Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… రిపెరులో ఉన్న మిని లారీనీ తరలిస్తుండగా ప్రమాదం….ముగ్గురు మృతి!

రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు అమలులో ఉంచినా కూడా ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది.ఇటీవల అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వివరాలలోకి వెళితే.. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రాంనేపల్లి వద్ద బుధవారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినిలారీ రిపేర్ రావటంతో ఇంకొక లారీ సహాయంతో మిని లారీని తరలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… రిపెరులో ఉన్న మిని లారీనీ తరలిస్తుండగా ప్రమాదం….ముగ్గురు మృతి!

మిని లారీని తరలిస్తున్న వాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ సంఘటన గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా..మినీ లారీని తరలిస్తున్న వాహనంలో ముగ్గురు వ్యక్తులు ఉండటంతో ఒక వ్యక్తి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. చికిత్స నిమిత్తం పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు.

డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం…


అయితే వారిద్దరూ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago