Featured

Aa Naluguru : “నీ ఒంటి బట్టా.. నీ నోట్ల కట్టా నీ వెంట రాదు రా..” అనే మాటలతో వయసు మల్లిన పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్.. జీవించారు.!!

కొన్ని సినిమాలు చూస్తుంటే మనమంత సినిమాలోని పాత్రలచే కలిసి ప్రయాణిస్తూంటాం. అందులో వచ్చే కొన్ని సీన్లు జీవితంలో మన చుట్టూ జరిగే సంఘటనలను గుర్తుచేస్తుంటాయి. పాత్రలకు వచ్చే బాధ ఆనందం ఏవైనా కావచ్చు కుర్చీలో కూర్చున్న మనమంతా కూడా వాటిని అనుభవిస్తుంటాం. కొన్ని సినిమాలు అసహజంగా నిజ జీవితానికి ఆమడ దూరంలో ఉంటే కొన్ని సినిమాలు సహజత్వం తో ప్రేక్షకులందరినీ అందులో ఇన్వాల్వ్ చేస్తుంటాయి.

కథా రచయిత మదన్ చిత్తూరు జిల్లా మదనపల్లెలో చదువుకునే రోజుల్లో అక్కడికి దగ్గరలో ఉన్న గ్రామంలో ఓ వ్యక్తి ఊరంతా అప్పులు చేసి మరణించాడు. కానీ అంతిమయాత్రకు ఊరు ఊరంతా కదలి వచ్ఛారు. దీనిచే ప్రేరణ పొందిన మదన్ మదిలో మెదిలిన కథ అంతిమయాత్ర. ముందుగా ఈ కథతో సీరియల్ తీద్దామని కొన్ని ఎపిసోడ్స్ రాసుకున్నారు. కానీ ఎందుకనో వర్కవుట్ కాలేదు. ఆ కథను ప్రముఖ నటుడు రచయిత భాగ్యరాజా గారికి వినిపించారు. ఆ కథలోని రఘురాం పాత్రను నేనే చేస్తానంటూ కథ తనకు కావాలని భాగ్యరాజా అడిగాడు. అందుకు మదన్ టీం నిరాకరించింది.

ఎట్టకేలకు చిట్టచివరికి ఆ నలుగురు సినిమా చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో తెరకెక్కింది. అంతిమయాత్ర కాస్త ఆ నలుగురు గా మార్చారు. ఈ సినిమాలో రఘురాం అనే ముఖ్య పాత్ర కోసం దాసరి, మోహన్ బాబు, ప్రకాష్ రాజు లను సంప్రదించారు. చివరికి రాజేంద్ర ప్రసాద్ ను తీసుకున్నారు.రాజేంద్రప్రసాద్ కు జోడీగా లక్ష్మి, భానుప్రియ, గౌతమి, రోజా అనుకున్నారు. కానీ చివరికి ప్రముఖ హీరోయిన్ ఆమని గారిని సెలెక్ట్ చేశారు.

2004లో విడుదలైన ఆ నలుగురు సినిమా పోస్టర్ చాలా డల్ గా ఉంది.స్టార్ హీరోలు ఎవరు కూడా కనిపించడం లేదు. వయసుమళ్ళిన పాత్ర లో రాజేంద్రప్రసాద్ కనబడుతున్నారు. ఇంకేముంది థియేటర్ కి వెళ్లి చూస్తే నలుగురు మాత్రమే ఉన్నారు. దర్శక నిర్మాతలు నిరాశ చెందారు. అలా రెండు వారాలు గడిచిన తర్వాత మూవి బాగుందనడంతో సినిమా హాల్ కు ఒక్కొక్కరుగా రావడం మొదలు పెట్టారు. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సినిమాకి కాసుల వర్షం కురిసింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ప్రేమించి పెళ్లి… చివరకు భర్త హత్య! హోలోగ్రామ్‌తో బయటపడిన షాకింగ్ కుట్ర

ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి…

8 hours ago

అషు రెడ్డి-టెక్కీ వివాదంలో ఆడియో బాంబ్

బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…

8 hours ago

ఒక్క ఛాన్స్ కోసం తిరిగిన సత్యరాజ్.. కట్టప్పగా వరల్డ్ ఫేమ్

దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా సాగింది. నేటి…

8 hours ago

“ఆ హీరో నా జీవితంలో గాడ్ ఫాదర్”.. అనుష్క ఎమోషనల్ కామెంట్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…

8 hours ago

“వినాశకాలే విపరీత బుద్ధి”.. యువతకు కఠిన హెచ్చరిక

ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…

9 hours ago

మోదీని డైరెక్ట్‌గా కలుస్తా.. మంచు లక్ష్మి రాజకీయ వ్యాఖ్యలు వైరల్

టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…

10 hours ago