ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు ఎనర్జిటిక్ స్టార్ రామ్. రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్, రెడ్ వంటి మాస్ యాక్షన్ చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే హీరో రామ్ తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి.
ఇదివరకు ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఈ సినిమాలో తమిళ హీరో మాధవన్ విలన్ పాత్రలో చేయబోతున్నారనే వార్తలు పెద్దఎత్తున వినిపించాయి.అయితే ఆ వార్తల్లో నిజం లేదని మాధవన్ స్పందించడంతో ఆ తర్వాత పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా హీరో రామ్ ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో చేయనున్న హీరో గురించి తెలియజేశారు.
ఇదివరకే తెలుగులో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, అల్లు అర్జున్ సరైనోడు వంటి సినిమాలలో విలన్ పాత్రలో తన మార్క్ ఏంటో చూపించిన ఆది పినిశెట్టి లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో మరోసారి హీరో రామ్ తో పోటీ పడనున్నారు. ఈ సందర్భంగా హీరో రామ్ ఆదికి స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశారు.
ఇక పోతే ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి జతకట్టారు. అదేవిధంగా నదియా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పనులు ప్రారంభించిన ఈ సినిమాకు చిత్రబృందం ‘ఉస్తాద్’అనే టైటిల్ పెట్టాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…