Aadi Movie: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలు రీ రిలీజ్ కావడం ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే మహేష్ బాబు నటించిన పోకిరి పవన్ కళ్యాణ్ జల్సా, చెన్నకేశవరెడ్డి వంటి సినిమాలు తిరిగి విడుదలై భారీ కలెక్షన్లను రాబట్టాయి. ఇక ఎన్టీఆర్ వంతు వచ్చింది.ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమా తిరిగి విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎన్టీఆర్ సినీ కెరియర్లో ఆది సినిమా ఎలాంటి రికార్డులు సృష్టించిందో మనకు తెలిసిందే. అతి చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆది సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.ఇక ఇదే సినిమాతోనే డైరెక్టర్ గా వివి వినాయక్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఆయన కూడా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ తొడగొట్టడం అమ్మతోడు అడ్డంగా నరుకుతా అనే డైలాగులు అప్పట్లో సూపర్ హిట్ అందుకున్నాయి. ఇకపోతే ఎన్టీఆర్ కెరియర్లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ఈ సినిమాని తిరిగి విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా నవంబర్ మూడవ వారంలో థియేటర్లో విడుదల కానుందనే విషయం తెలుస్తుంది.
ఇక ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడించనున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కీర్తి చావ్లా హీరోయిన్ గా నటించారు.ఇక ఆది సినిమా విడుదల కాబోతుందని తెలియడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లోనే బ్లాక్ బస్టర్ అయినటువంటి ఈ సినిమా తిరిగి సరికొత్త రికార్డులు సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం వ్యక్తం చేయాల్సిన పనిలేదు. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…