General News

Air India Crash Report: ఇంజిన్లు మొరాయించడమే ప్రధాన కారణం, కుట్ర కోణం లేదని స్పష్టం చేసిన AAIB నివేదిక

గత నెల అహ్మదాబాద్‌ వద్ద జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) 15 పేజీల ప్రాథమిక నివేదికను సమర్పించింది. ఈ ప్రమాదానికి రెండు ఇంజిన్లు సకాలంలో పనిచేయకపోవడమే కారణమని, ఇందులో కుట్ర కోణం ఏదీ లేదని స్పష్టం చేసింది.

AAIB report clarifies that engine noise was the main cause, no conspiracy angle

టేకాఫ్ అయిన కొద్దిక్షణాలకే ఫ్యూయల్ సప్లై ఆగిపోవడంతో ఇంజిన్లు పని చేయడం మానేశాయి. ఈ విషయంలో పైలట్ల మధ్య జరిగిన సంభాషణ కాక్‌పిట్ ఆడియోలో రికార్డు అయ్యింది. “ఫ్యూయల్ కట్ ఆఫ్ చేశావా?” అన్న ఒక పైలట్‌కు “లేదు, నేనేం చేయలేదు” అంటూ మరొక పైలట్ స్పందించాడు. పవర్ కోల్పోయిన వెంటనే ర్యామ్ ఎయిర్ టర్బైన్ ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయినట్లు రికార్డుల్లో ఉంది. పైలట్లు ఇంజిన్లను మళ్లీ ఆన్ చేయడానికి యత్నించినా, ఒక ఇంజన్ మాత్రమే రీస్టార్ట్ అవగా, రెండో ఇంజన్ స్పందించకపోవడంతో కేవలం 32 సెకన్ల వ్యవధిలోనే విమానం కూలిపోయింది.

AAIB నివేదిక ప్రకారం, విమానంలో ఫ్యూయల్ పరిశుభ్రంగానే ఉండి, కలుషిత పదార్థాల జాడ ఏదీ లభించలేదు. పక్షుల ఢీ కొట్టిన సంఘటనలు లేవు. వాతావరణం సానుకూలంగానే ఉంది. టేకాఫ్‌కు అవసరమైన రెక్కలు, గేర్ల వ్యవస్థ సరిగ్గా పని చేసినట్లు నివేదిక చెబుతోంది. విమానంలో అధిక బరువులు లేవు. పైలట్లు అనుభవజ్ఞులు కాగా, ఆరోగ్యపరమైన సమస్యలు లేదా మానసిక ఒత్తిడులేమీ లేదని స్పష్టమైంది.

కూట్ర కోణాన్ని ఖండించిన ఈ నివేదికపై Air India మాత్రం పూర్తిస్థాయి దర్యాప్తు పూర్తయ్యే వరకూ ఎలాంటి వ్యాఖ్య చేయలేమని తెలిపింది. AAIB తాజా నివేదిక వాస్తవ పరిణామాలను స్పష్టంగా రుజువు చేసినప్పటికీ, ఈ ఘటనపై ఇంకా లోతైన విచారణ కొనసాగుతుందని పేర్కొంది.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago