Featured

Aapadbandhavudu : ఆపద్బాంధవుడుకి నందుల పురస్కారం.. ప్రేక్షకుల తిరస్కారం.!!

మంచి అభిరుచిగల నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. చిన్నప్పుడు అనేక నాటకాల్లో నటించారు. నాటకాలపై ఆసక్తిని గమనించిన వి.బి.రాజేంద్రప్రసాద్ ఆయనను మొదటగా “అన్నపూర్ణ” చిత్రంలో ఒక వేషం వేయడానికి మద్రాస్ తీసుకువెళ్లారు. కానీ అక్కడికి వెళ్ళాక ఆ సినిమాలో అవకాశం దొరకలేదు. ఆ తర్వాత డబ్బింగ్ కళాకారుడిగా “పార్వతీ కల్యాణం” చిత్రంలో శివుడి పాత్రకు ఏడిద నాగేశ్వరరావు డబ్బింగ్ చెప్పారు. ఆ సినిమాకు 500 రూపాయల పారితోషికం లభించింది. ఆ తర్వాత “నేరముశిక్ష” మానవుడు-దానవుడు లాంటి చిత్రాల్లో ఆయన నటించారు. నేరముశిక్ష చిత్రంలో నటించడంతో కె.విశ్వనాథ్ ఆయనకు పరిచయమయ్యారు.

ఏడిద నాగేశ్వరరావు ‘సిరిసిరిమువ్వ” చిత్రాన్ని మొదటిసారిగా నిర్మించారు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో తన బంధువులతో కలిసి “పూర్ణోదయ మూవీ క్రియేషన్స్” అనే బ్యానర్ ను స్థాపించారు. ఆ తర్వాత శంకరాభరణం, సీతాకోకచిలుక, సితార, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల స్వయంకృషి, ఆపద్బాంధవుడు చిత్రాలు నిర్మించారు.

చిరంజీవి-పూర్ణోదయ క్రియేషన్స్ కాంబినేషన్ లో రెండవ సినిమా.. కె.విశ్వనాథ్-చిరంజీవి కలయికలో మూడవ చిత్రం “ఆపద్బాంధవుడు. 1992 ఏడిద నాగేశ్వరరావు నిర్మాణం కె.విశ్వనాథ్ దర్శకత్వంలో “ఆపద్బాంధవుడు” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, మీనాక్షిశేషాద్రి హీరో,హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో కవి, ఉపాధ్యాయుడిగా జంధ్యాల ప్రధాన పాత్రను పోషించారు. కళా దర్శకుడు విశ్వనాథ్ ఆస్థానకవిగా “సిరిసిరిమువ్వ” చిత్రం నుంచి పనిచేస్తున్న జంధ్యాలకి ఈ సినిమాలోని మీనాక్షిశేషాద్రి తండ్రి పాత్ర బాగా నచ్చడంతో.. కథా చర్చలు విశ్వనాధ్-జంధ్యాల మధ్య నడుస్తున్న.. ఆ పాత్ర తాను వేస్తానన్న విషయాన్ని మొహమాటంతో చెప్పలేకపోయాడు.

చివరికి ఆ పాత్ర పోషిస్తాననన్న విషయాన్ని ఒక కాగితంపై రాసి విశ్వనాధ్ కు పంపించారు. అది చదివిన కె.విశ్వనాథ్ నవ్వుకొని అందులోని కవిగా జంధ్యాల అయితే బాగుంటుందని.. సరే అని ఒప్పుకున్నారు. నిజంగా జంధ్యాల ఆ పాత్రకు ప్రాణం పోశారని చెప్పవచ్చు. ఇకపపోతే చిరంజీవి పరిపక్వతతో కూడిన నటనను అత్యంత సహజసిద్ధంగా పోషించారని చెప్పవచ్చు. చిరంజీవి మీనాక్షిశేషాద్రి మధ్య వచ్చే “ఔరా అమ్మక చెల్లా… ఆలకించి నమ్మడం మెల్లా”.. అనే గీతం అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందినప్పటికీ పురస్కారాల వర్షాన్ని కురిపించింది.

ఉత్తమ నటుడిగా చిరంజీవి, ఉత్తమ నిర్మాతగా ఏడిద నాగేశ్వరరావు.. ఉత్తమ దర్శకుడిగా కె.విశ్వనాథ్.. ఉత్తమ సంభాషణల రచయితగా జంధ్యాల.. ఉత్తమ నృత్య దర్శకుడుగా భూషణ్.. ఉత్తమ కళా దర్శకుడుగా చలం.. నంది పురస్కారాలను అందుకున్నారు. “ఆపద్బాంధవుడు” చిత్రం ప్రేక్షకుల తిరస్కారానికి గురైనా.. నందుల పురస్కారాలను అందుకుంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago