Featured

Aata Sandeep & Jyothi : పెళ్ళై బాబు పుట్టాక కష్టాలు… జేబులో డబ్బులేక… డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను… హెల్త్ బాగోలేక ఏమైందంటే…: ఆట సందీప్ & జ్యోతి

Aata Sandeep & Jyothi : ఓంకార్ తెలుగు రియాలిటీ షోలలో సంచలనం. ఆట, మాయాద్వీపం వంటి షోలతో బాగా పాపులర్ అయిన ఓంకార్ ఆ తరువాత సినిమాలను కూడా తీస్తున్నారు. అయితే ఆయన ఆట డాన్స్ షో ద్వారా చాలా మంది కొరియోగ్రాఫర్లుగా సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. మొదట్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వీళ్లంతా ఇపుడు అవకాశాలు లేక ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. అయితే యూట్యూబ్ ఛానల్ ద్వారా డాన్స్ వీడియోలు పెడుతూ మళ్ళీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆట సందీప్, జ్యోతి రాజ్. వీరిద్దరూ త్వరలో ఒక సినిమాలో కూడా కనిపించబోతున్నారు. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో తమ లైఫ్ స్ట్రగల్స్ గురించి ఈ జంట పంచుకున్నారు.

డబ్బు లేక అవస్థలు…

ఆట టైటిల్ విన్నర్ అయిన సందీప్ ఆ షో తరువాత డాన్సర్ జ్యోతి రాజ్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే ఆట షోకి మంచి పాపులరిటీ ఉండటం వల్ల వెంటనే వరుస అవకాశాలు వస్తాయని అనుకున్నా పెద్దగా సినిమాల్లో అవకాశాలు రాలేదు. ఇక బాబు పుట్టాక ఒకరోజు అవకాశల కోసం సురేష్ ప్రొడక్షన్స్ కి వెళ్లి తిరిగి బండి మీద వెళ్తుంటే పెట్రోల్ అయిపోగా పెట్రోల్ కొట్టించడానికి అని బంక్ వద్దకు వెళ్ళి జేబులో చూసుకుంటే డబ్బులు లేవట. ఇక ఫోన్ చేసి ఎవరికైనా చెబుదామంటే ఫోన్ లో కూడా డబ్బులు లేవట, ఆరోజు చాలా బాధేసి రోడ్డుపక్కన బైక్ మీద కూర్చొని బాగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడట సందీప్.

తాను సినిమాలంటూ వెళ్తే కుటుంబం పరిస్థితి ఏమిటి అని అలోచించి ముందు ఆర్థికంగా సెటిల్ అయి అపైన సినిమాల్లోకి రావాలని అనుకున్నారట. అలా కెరీర్ ను పక్కన పెట్టి ముందు ఆర్థికంగా సెటిల్ అయ్యారట. ఇక జ్యోతి రాజ్ కూడా మాట్లాడుతూ తన పెళ్లి, వెంటనే బాబు పుట్టడం, చిన్న వయసులో ఇదంతా జరగడంతో బాగా లావుగా మారిపోయి డాన్స్ చేయలేనని బాధపడ్డాను అంటూ చెప్పారు. మళ్ళీ డాన్స్ చేయాలని చాలా అనిపించింది కానీ ఒకవైపు అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులను పడ్డాను. కానీ నా భర్త పక్కన మళ్ళీ డాన్స్ చేయాలని అనుకున్నా. ఈ రోజుకు అది మళ్ళీ కుదిరింది అంటూ తమ జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago