Actress Anjali: తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్ గా నటించిన అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫోటో సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అంజలి ఆ తర్వాత వరుసగా తమిళ సినిమాలలో నటించి అక్కడ హీరోయిన్గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా మళ్ళీ టాలీవుడ్లో అడుగుపెట్టి బలుపు, మసాలా వంటి ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించింది.
ఇక సరైనోడు సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది. ఇలా తెలుగు తమిళ్ కన్నడ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండే అంజలి వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. ఇదిలా ఉండగా గతంలో అంజలి ప్రేమ విషయాల గురించి పెద్ద ఎత్తున వార్తలు సంచలనం సృష్టించాయి. అలాగే తమిళ నటుడు జై తో కూడా ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఇదిలా ఉండగా అంజలి మాత్రం ఇప్పటివరకు సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తూ వస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అంజలికి అభిమానుల నుండి తరచూ ప్రేమ, పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొకసారి పెళ్లి గురించి ఆమె వద్ద ప్రస్తావించగా అంజలి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లి గురించి అభిమానులు అడిగిన ప్రశ్నలకు అంజలి స్పందిస్తూ… ” ఏ రిలేషన్షిప్ లో ఆయన రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యం అంటూ చెప్పుకొచ్చింది.
ముఖ్యంగా పెళ్లి లో రెస్పెక్ట్ తర్వాతే ప్రేమ అని తెలిపింది. మనకు రెస్పెక్ట్ ఇవ్వని వ్యక్తులతో రిలేషన్ మైంటైన్ చేయటం అనవసరం అంటూ తెలిపింది. అంతేకాకుండా జై తనకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం వల్ల తనతో రిలేషన్ బ్రేకప్ చేసుకున్నట్లు కూడా అంజలి తెలిపినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలా అంజలి జైతో ఉన్న రిలేషన్ గురించి, బ్రేకప్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…