Featured

Singer Srivardhini : థమన్ తో లవ్ మ్యారేజ్… పెళ్లయ్యాక ఆరేళ్లు గ్యాప్… బాబుతో ఉండటం లేదని బాధ…: సింగర్ వర్ధిని

Singer Srivardhini : ప్రస్తుతం హీరోలకు, దర్శకులకు మ్యూజిక్ డైరెక్టర్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు థమన్. ప్రస్తుతం సౌత్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా థమన్ కొనసాగుతున్నారు. సినిమాలలో థమన్ ఇచ్చే పాటలే కాదు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా అదరగొడుతున్నాడు. సినిమాలు విజయం సాధించడానికి థమన్ పాత్ర కూడా ఉంటుంది అనడంలో అతిషయోక్తి లేదు. కెరీర్లో ఇంత విజయం సాధించిన థమన్ వ్యక్తిగత జీవితంలో ఇద్దరి మహిళల ప్రోత్సాహం ఆయన విజయలకు కారణం. మొదట ఆయన తల్లి సావిత్రి కాగా రెండోది ఆయన భార్య ప్రముఖ గాయని శ్రీవర్థిని. శ్రీవర్థిని గారు థమన్ ను పెళ్లి చేసుకునే సమయానికి అప్పటికే మంచి సింగర్ గా పేరు తెచ్చుకున్నారు. అయినా ఆమె కెరీర్ ను పక్కన పెట్టి ఇంటి బాధ్యతలను తీసుకోవడం వల్లే థమన్ ఇంత సక్సెస్ అయ్యారు. ఇక సింగర్ శ్రీ వర్ధిని గారు మీడియాలో పెద్దగా కనిపించరు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

మా పెళ్లి అలా జరిగింది…

థమన్ గారి పెద్దమ్మ బి.వసంత గారు అప్పట్లో ఫేమస్ సింగర్. అలాగే వర్ధిని గారి తండ్రి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేయడం వల్ల ఇరు కుటుంబాలకు పరిచయం ఉండేది. అలా ఒకానొక సందర్భంలో వసంత గారు వర్ధిని తండ్రి గారిని అడగటంతో పెళ్లి కుదిరిందట. ఆ సమయంలో థమన్ గారు ప్రోగ్రామ్ మేనేజర్ గా వర్ధిని గారు ట్రాక్ సింగర్ గా మణిశర్మ వద్దే పనిచేసినా పెద్దగా పరిచయం లేదట. వారిది ప్రేమ వివాహం అని చాలా మంది అనుకుంటారు కానీ అలాంటిదేమి లేదు అంటూ వర్ధిని క్లారిటీ ఇచ్చారు. ఇక 2006లో పెళ్లి అయ్యాక తాను దాదాపు 6 ఏళ్ళు సింగింగ్ కెరీర్ కు దూరం అయ్యానని వర్ధిని తెలిపారు.

ఇంట్లో ఎవరూ ఆంక్షలు పెట్టకపోయినా గాప్ తీసుకున్నానని ఆపైన మళ్ళీ తమిళంలో విద్యాసాగర్ గారు విక్రమార్కుడు తమిళ సినిమాలో ట్రాక్ పాడమని అవకాశం ఇవ్వడంతో మళ్ళీ సినిమాల్లో పాడటం మొదలు పెట్టానని తెలిపారు. ఇక థమన్ గారు 2008 నుండి మ్యూజిక్ డైరెక్టర్ గా బిజీ అవడం వల్ల ఇంట్లో అన్ని విషయాలు నేనే చూసుకున్నానని బాబు పుట్టిన రెండేళ్లు తాను సమయం గడిపేవాడు ఆపైన బిజీ అయిపోవడం వల్ల నేనే చూసుకున్నాను అంటూ చెప్పారు. ఆ విషయంలో థమన్ బాధపడినా కెరీర్ లో అవకాశాలు వచ్చినపుడే ఉపయోగించుకోవాలి అంటూ వర్ధిని తెలిపారు. తెలుగులో వర్ధిని స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ఒకరికి ఒకరై సాంగ్ తో మంచిపేరు తెచ్చుకోగా రీసెంట్ గా వచ్చిన విశాల్ టమ్ టమ్ సాంగ్ తో మరింత ఫేమస్ అయ్యారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago