NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర సినిమా కూడా ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గట్టు పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని సినిమా మీద అంచనాలు రెట్టింపు చేశాయి.
ఇక ఈ సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి ఎన్టీఆర్ పని చేయనున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ తో తీయబోయే సినిమా కి సంబంధించిన పనులు మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోతున్న సినిమాలో ఎన్టీఆర్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా గురించి మరొక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో లేడీ విలన్ గా మరొక బాలీవుడ్ బ్యూటీ నటించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఆ బాలీవుడ్ బ్యూటీ మరెవరో కాదు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్. ఈ సినిమాలో విలన్ గా ఐశ్వర్యరాయ్ ని చూస్ చేసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి . ఒకవేళ అదే నిజమైతే మాత్రం సినిమా ఇండస్ట్రీలోనే ఇది ఒక పెద్ద రికార్డుగా మిగిలిపోతుంది. ఓ టాలీవుడ్ హీరో కోసం బాలీవుడ్ స్టార్ బ్యూటీ..విలన్ గా మారడం ఇదే ఫస్ట్ టైం అవుతుంది. మొత్తానికి ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…