Featured

Saikrishna Father : నా కొడుకు అందగాడు అందుకే అప్సర వాడితో… ఆ అమ్మాయి ఆ నలుగురితో తిరిగేది…: సాయికృష్ణ తండ్రి

Saikrishna Father : అప్సర హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. సరూర్ నగర్ కి చెందిన వెంకట సూర్య సాయి కృష్ణ అనే 36 ఏళ్ల వ్యక్తి అక్కడి స్థానిక వెంకటేశ్వర కాలనీ లోని దేవాలయంలో పూజారిగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే బిల్డర్ గా ఉన్న సాయి కృష్ణ కు తన తండ్రికి అక్కడి చుట్టుపక్కల మంచి పలుకుబడి ఉంది. ఇక చెన్నై నుండి వచ్చి సరూర్ నగర్ లో స్థిరపడిన అప్సర అనే 30 ఏళ్ల యువతి తన తల్లితో పాటు ఉంటోంది. అప్సర తండ్రి కాశిలో పని చేస్తుండగా ఇక్కడ తల్లి వద్దే ఉంది అప్సర. ఇక తనకు ఒక అక్క ఉండగా ఆమెకు పెళ్ళై చెన్నైలో ఉంది. అప్సర గుడికి వెళ్తుండగా సాయికృష్ణ పరిచయం అవడం, ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీయడం జరిగాయి. చివరకు సాయి కృష్ణ అప్సరను హత్య చేసేవరకు పరిస్థితులు వెళ్లాయి. అయితే ఈ కేసులో సాయి కృష్ణ తండ్రి యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

నా కొడుకు మంచివాడు… అప్సర అబ్బాయిలతో క్లోజ్ గా ఉండేది…

అప్సర గురించి ఆమె ఒత్తిడి చేస్తున్న విషయం ఇంట్లో చెప్పి ఉంటే పెద్దల సమక్షంలో పంచాయితీ చేసేవాళ్ళం. ఆమెను పోలీసుల వద్దకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించేవాళ్ళం. నా కొడుకు మాతో చెప్పకుండా తప్పు చేసాడు. పోలీస్ స్టేషన్ లో చెప్పినపుడే అప్సర టార్చర్ భరించలేక చంపానని చెప్పాడు అంతవరకు మాకు విషయం తెలియదని చెప్పారు సాయికృష్ణ తండ్రి. మూడో తేదీ నుంచి నాకొడుకు ఇంట్లోనే ఉన్నాడు. మూడో తేదీ రాత్రి రాలేదు, ఆ మరుసటి రోజు ఉదయం 5 గంటలకు వచ్చాడు.

రకరకాల సమస్యలతో విదేశాల నుంచి తెలుగు వారు నా కొడుక్కి ఫోన్లు చేసి సలహాలు అడుగుతుంటారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా నుంచి సరూర్ నగర్ వెంకటేశ్వర కాలనీ 15 రోడ్లలో వరకు నాకొడుకు అంటే తెలియని వ్యక్తి లేరు. మావాడు నిత్యాన్నదానం ఏడాది నుంచి నడుపుతున్నాడు రోజుకు 300 మందికి ఉచితంగా అన్నం పెడుతున్నాడు. నాకొడుకు, వాడి భార్య, నాలుగేళ్ల కూతురు మా ఇంట్లోనే ఉంటారు. పరాయి ఆడపిల్ల గురించి ఎలాంటి మాటలు మా ఇంట్లో ఉండవు. నా కొడుకు అందగాడు అందుకే ఆడవాళ్లు ఎక్కువగా మాట్లాడుతుంటారు అలానే అప్సర కుడా మాట్లాడింది. ఒకటి రెండు సార్లు గుడిలో ఎక్కువ సేపు ఆ అమ్మాయి ఉండటం చూసి నేనే నా కొడుకును వాడి స్నేహితులను హెచ్చరించాను. ఆడపిల్లతో జాగ్రత్త అని చెప్పాను. అప్సర నాకొడుకు తోనే కాదు గుడిలో మరో నలుగురితోను చనువుగా మాట్లాడేది అంటూ చెప్పారు. ఒకవేళ నిజంగానే నా కొడుకు తప్పు చేసి ఉంటే శిక్ష తప్పదు అంటూ సాయికృష్ణ తండ్రి తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago