Movie News

Abhinaya Krishna : శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు వాళ్లందరికీ డబ్బులిచ్చారు… కానీ నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు కారణం అదే : అదిరే అభి

Abhinaya Krishna : జబర్దస్త్ నుండి బయటికి వచ్చి వేరే ఛానల్ లో కమెడియన్ గా ఉన్న కిర్రాక్ ఆర్పి జబర్దస్త్ మీద, అలాగే మల్లెమాల సంస్థ మీద చాలా విమర్శలు చేసాడు. జబర్దస్త్ వాళ్ళను సరిగా చూడరని అవమానకరంగా మాట్లాడుతారని, ఇబ్బందుల్లో ఉన్నపుడు కనీసం సహాయం చేయరు, ఇక అక్కడ పెట్టే తిండి మనుషులు తినే తిండి లాగా ఉండదు అంటూ తీవ్రంగా ఆరోపణలు చేసాడు. ఇక వీరికి అనేక మంది జబర్దస్త్ కమెడియన్స్ స్పందించి వివరణ ఇస్తున్నారు.

అందరికీ అలా డబ్బులిచ్చారు…

ఇక తాజాగా జబర్దస్త్ నుండి అదిరే అభి కూడా బయటకు వెళ్ళిపోయాడు. అదిరే అభి సినిమాల్లో చేస్తూ జబర్దస్త్ కు వచ్చాడు. ఇక అలాగే బాహుబలి సినిమాకు రాజమౌళి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసారు. అది కాక మీలో ఎవరు కోటీశ్వర్లు వంటి షో కోసం క్రియేటివ్ హెడ్ గా కూడా పనిచేసారు. అయినా ఎప్పుడూ జబర్దస్త్ ను వీడలేదు. కానీ ప్రస్తుతం కారణాలు తెలియవు కానీ జబర్దస్త్ నుండి వెళ్లిపోయారు. అయితే అభి సినిమాల్లో కూడా చేస్తున్నారు. అలాగే సినిమా తీస్తున్నారు కూడా.

ఇక అదిరే అభి వద్ద జబర్దస్త్ ఇష్యూ ప్రస్థావించినపుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు జబర్దస్త్ కమెడియన్స్ కి యాంకర్స్ కి ఇల్లు కట్టుకోడానికి డబ్బులు ఇచ్చారా అని అడుగగా అక్కడ పనిచేసే వాళ్ళు, ఆ సంస్థలోనే ఇంకా కొన్నేళ్లు పనిచేస్తారు అన్నపుడు అవసరానికి అడ్వాన్సులు ముందే ఇచ్చేవారని, కానీ నేనెపుడు అలా తీసుకోలేదని తెలిపారు. నాకు అప్పంటే చాలా భయం నా జీవితంలో ఒకసారి మాత్రం మా కజిన్ తో అప్పు తీసుకున్న ఒక ఇరవైవేలు నెలలోనే తీర్చేసాను, అప్పు ఉంటే నాకు నిద్ర పట్టదు. ఇక నాకు పెద్దగా ఆర్థిక సమస్యలు లేవు సాఫ్ట్ వేర్ గా నా ఉద్యోగం నాకుంది అందువల్ల ఇబ్బందులు రాలేదు. ఇక లాక్ డౌన్ సమయంలో ఒక షెడ్యూల్ పేమెంట్ ముందే అందరికి మల్లెమాల వాళ్ళు పంపారు. మేము కూడా టీం మేట్స్ కి ముందే పేమెంట్ ఇచ్చేసాము అంటూ జబర్దస్త్ గురించి చెప్పారు అభి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago