మనం ప్రతి రోజు వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుని తింటాము. అయితే మనం చేసుకున్న ఆహార పదార్థాలు మనకు రుచి కలిగి ఉండాలంటే తప్పనిసరిగా అందులోకి ఉప్పు వేయాల్సిందే. తగినంత మోతాదులో ఉప్పు లేకపోతే ఆ ఆహారపదార్థాలకు ఎలాంటి రుచి ఉండదు. ఆహార పదార్థాలకు రుచి రావాలంటే తప్పనిసరిగా ఉప్పు వేయాల్సిందే. అయితే సరైన మోతాదులో ఉప్పు వాడటం వల్ల మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. కానీ మితిమీరి ఉప్పును వాడటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి.ఈ క్రమంలోనే అధిక శాతం ఉప్పు వాడటం వల్ల మనలో కొన్ని లక్షణాలు తలెత్తుతాయి.అయితే ఈ లక్షణాలు కనుక మీలో కనిపిస్తున్నాయంటే తప్పకుండా మీరు అధికంగా ఉప్పును తీసుకున్నట్లే. మరి ఆ లక్షణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
సాధారణంగా సరైన మోతాదులో ఉప్పు తీసుకునే వారితో పోలిస్తే కొంచెం అధిక మోతాదులో తీసుకునే వారు రోజుకు రెండు నుంచి మూడు నాలుగు సార్లు మూత్ర విసర్జనకు వెళ్తారు.ఈ విధంగా మూత్రవిసర్జనకు వెళుతూ అధిక మొత్తంలో నీటిని తీసుకుంటూ ఉంటే తప్పకుండా మీరు అధిక మోతాదులో ఉప్పును ఉపయోగిస్తున్నారని అర్థం. ఈ క్రమంలోనే ఉప్పును తగ్గించడం వల్ల మూత్ర విసర్జన సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
చాలామందికి కాలి మడమల దగ్గర వాపులు కనిపిస్తాయి.అయితే ఆ వాపు పై మనం వేలితో నొక్కి నప్పుడు మెత్తగా చర్మం లోపలికి వెళుతుంది.ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడుతుంటే మీరు ఉప్పును అధికంగా తీసుకుంటున్నట్లు అని అర్థం. అదేవిధంగా మరికొందరు ఎనీమియా వ్యాధితో బాధపడే వారిలో కూడా చర్మంలో అక్కడక్కడ నీరు చేరి చర్మం ఎంతో మెత్తగా ఉబ్బినట్లు కనబడుతుంది.
ప్రతి రోజు వారి ఆహారంలో భాగంగా ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరం వెంటనే డీహైడ్రేషన్ కు గురి అవుతుంది.ఈ క్రమంలోనే ఎక్కువగా నీటిని తాగాలి అనే కోరిక కలుగుతుంది. ఇలాంటి కోరిక మీలో కలిగితే మీరు ఉప్పును అధికంగా తీసుకుంటున్నారని నిపుణులు తెలుపుతున్నారు.అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందాలంటే మన ఆహారంలో క్రమంగా ఉప్పును తగ్గించడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…