దేశంలో లక్షల సంఖ్యలో ఉద్యోగులు కరోనా మహమ్మారి, లాక్ డౌన్ వల్ల నిరుద్యోగులైన సంగతి తెలిసిందే. కేంద్రం ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లకు ప్రయోజనం చేకూర్చడం కోసం అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా ఈఎస్‌ఐ నుంచి కరోనా, లాక్ డౌన్ సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లు నిరుద్యోగ భృతిని పొందే అవకాశం ఉంటుంది.
ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలనుకునేవాళ్లు https://www.esic.in/ వెబ్ సైట్ లోకి లాగ్ ఇన్ కావాలి. అనంతరం ఏబీవీకేవై క్లెయిమ్ అనే విభాగాన్ని ఎంచుకోవాలి. ఆ తరువాత నిరుద్యోగ భృతిని ఎప్పటినుంచి ఎప్పటివరకు పొందాలనే అంశం గురించి ఎంచుకోవాలి. ఆ తర్వాత ఏబీ–1 ఫామ్ ప్రింట్ తీసుకొని 20 రూపాయల స్టాంప్ పేపర్ పై నోటరీ చేయించి నిరుద్యోగ కాల వివరాలను పొందుపరచాలి. ఆ ఫామ్ పై దరఖాస్తుదారు సంతకం చేయాలి.
అనంతరం ఏబీ 2 అనే ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకొని ఆ ఫామ్ కంపెనీ యాజమాన్యంతో సంతకం చేయించాలి. యజమాన్యం ధృవీకరించని పక్షంలో పీఎఫ్ నంబర్ ను ఈఎస్‌ఐ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఈఎస్‌ఐ కార్డును అఫిడవిట్ కు జత చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారు ఉద్యోగం లేకపోతేనే నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
రెండు సంవత్సరాలపాటు కనీసం సంస్థల్లో పని చేసిన వాళ్లు మాత్రమే నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. యాజమాన్యాలు ధృవీకరించని పక్షంలో ఈఎస్‌ఐ కార్యాలయంలో సంప్రదించి వివరలు తెలుసుకోవాల్సి ఉంటుంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…