Featured

Rashmika: రష్మిక డీప్ ఫేక్ కేసులో నిందితుడు అరెస్ట్.. అతను ఎవరంటే?

Published

on

Rashmika: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో గురించి మనందరికీ తెలిసిందే. ఇటీవల సోషల్ మీడియాలో రష్మిక ఫేక్ వీడియో ఒకటి తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వీడియో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఈ విషయంపై స్పందిస్తూ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఒక వారం రోజుల పాటు ఎక్కడ చూసినా కూడా ఈ వీడియో గురించే చర్చించుకున్నారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున వార్తలు కూడా వినిపించాయి.

ఈ వీడియోపై కేంద్రం స్పందించడంతో పాటు ఢిల్లీ మహిళా కమిషన్ కూడా దృష్టి పెట్టింది. ఇక రష్మిక డీప్ ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పటినుంచి ఈ డీప్ ఫేక్ క్రియేట్ చేసిన వ్యక్తిపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహించగా ఎట్టకేలకు తాజాగా అతన్ని గుర్తించి అరెస్టు చేశారు. అంతేకాకుండా అతను ఏపీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇటీవల కాలంలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి కొందరు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ వారీ ముఖాలను మార్ఫింగ్ చేసి వీడియోలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

మొదట బలైంది రష్మికానే..

Advertisement

అంతేకాకుండా అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను ఇంస్టాగ్రామ్ లో ట్విట్టర్ లో, ఫేస్ బుక్ లలో షేర్ చేస్తున్నారు. ఈ విషయంలో ముందుగా బలయింది మాత్రం రష్మిక మందన. ఈమె వీడియో బయటకు విడుదల అయిన తర్వాత చాలామంది హీరోయిన్ల డీప్ ఫేక్ వీడియోలు అలాగే సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం పట్ల పోలీసులు కాస్త ప్రత్యేక శ్రద్ధను వహించారు. ఈ సంఘటనలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ మొట్ట మొదట రష్మికకి మద్దతు తెలిపారు. ఆ తర్వాత పలువురు సెలబ్రిటీలు రష్మిక కి సపోర్ట్ చేయడం డీప్ ఫేక్ వీడియోల్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం జరిగింది. దీనిపై లీగల్ యాక్షన్స్ కూడా మొదలు పెట్టారు.

Advertisement

Trending

Exit mobile version