Gopi Chand: మరోసారి మహేష్ కు విలన్ గా మారిన యాక్షన్ హీరో గోపీచంద్.. డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!
Gopi Chand: టాలెంటెడ్, యాక్షన్ హీరో గోపీచంద్ కెరియర్ మొదట్లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరోగా పలు సినిమాలలో నటిస్తూ హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో మంచి విజయాన్ని అందుకున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా గోపీచంద్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గోపీచంద్ తన కెరియర్ మొదట్లో వర్షం, నిజం, జయం వంటి సినిమాలలో విలన్ పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనంతరం హీరోగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
ఇలా హీరోగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరోకి తిరిగి విలన్ పాత్రలో నటించే అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. ఇదివరకే మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమాలో గోపీచంద్ విలన్ పాత్ర ద్వారా మహేష్ బాబుతో పోటీపడ్డారు. ఈ క్రమంలోనే గోపీచంద్ కు మరోసారి మహేష్ బాబుతో పోటీ పడే అవకాశం వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పాల్గొననున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా పూర్తి కాగానే మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమాల్లో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో మహేష్ బాబుతో పోటీ పడటం కోసం దర్శక ధీరుడు గోపీచంద్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.హీరోగా మంచి పేరు సంపాదించుకున్న గోపీచంద్ ఇలా నెగిటివ్ పాత్రలో నటించడానికి ఒప్పుకుంటారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…