Priyanka Chopra: తల్లిదండ్రులైన ప్రియాంక చోప్రా - నిక్ దంపతులు… పోస్ట్ వైరల్!
Priyanka Chopra: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా, గ్లోబల్ స్టార్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమె ప్రస్తుతం హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇక ప్రియాంక చోప్రా 2018 సంవత్సరంలో తనకన్నా వయసులో పది సంవత్సరాలు చిన్నవాడైన అమెరికన్ పాప్ సింగర్ నిక్‌జొనాస్ ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వీరి వివాహం తర్వాత ఈ దంపతులిద్దరూ లాస్ ఏంజెల్స్ లో నివసిస్తున్నారు. ఇదిలావుండగా తాజాగా ఈ దంపతులు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఓ శుభవార్త తెలియజేశారు.
ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన అభిమానులకు ఒక విషయాన్ని తెలియజేశారు. తాను నిక్ పండంటి బిడ్డకు తల్లిదండ్రులు అయ్యామనే శుభవార్తను తెలియజేస్తూ అందరికీ సర్ప్రైజ్ చేశారు.
ఈ క్రమంలోనే ఈమె ఈ విషయాన్ని తెలియజేస్తూ సరోగసీ పద్ధతి ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చిన సమయం మాకు ఎంతో విలువైనది. ఈ ఆనంద సమయాన్ని మీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సమయం మా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది కనుక మా ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరుతున్నట్లు ప్రియాంక చోప్రా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…