Bangarraju Movie: బంగార్రాజు సినిమాలో బ్రహ్మానందం లేక పోవడానికి కారణం ఇదే: నాగార్జున
Bangarraju Movie: కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నాగచైతన్య కలిసి నటించిన సినిమా బంగార్రాజు. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.ఇలా మొదటి వారం అద్భుతమైన కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా కోసం నాగార్జున పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.సోగ్గాడే చిన్నినాయన చిత్రానికి సీక్వెల్ చిత్రంగా వచ్చిన ఈ సినిమాలో బ్రహ్మానందం లేకపోవడం గురించి పలువురు సందేహాలను వ్యక్తపరిచారు.
అయితే ఈ సినిమాలో బ్రహ్మానందం ఎందుకు లేరు అనే విషయం గురించి నాగార్జున క్లారిటీ ఇచ్చారు. సోగ్గాడే చిన్నినాయన సినిమా తండ్రి కొడుకులకు సంబంధించిన కథతో వచ్చినది.అలాగే బంగార్రాజు సినిమా తాతా-మనవడు కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయాన్ని నాగార్జున గుర్తు చేశారు.
సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో బ్రహ్మానందం ఆత్మానందం పాత్రలో నటించారు. అయితే బంగార్రాజు సినిమాలో తాతా మనవడు స్టోరీ ఉండటంవల్ల బ్రహ్మానందాన్ని తీసుకోలేదు.ఒకవేళ ఆయనని కనుక తీసుకొని ఉంటే ఈ సినిమా 30 సంవత్సరాలకు పైబడిన స్టోరీ కాకుండా.. 85 సంవత్సరాలకు పైబడిన స్టోరీగా చూపించాల్సి వస్తుంది కనుక ఈ సినిమాలో బ్రహ్మానందం గారిని తీసుకోలేదని నాగార్జున తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…