Actor Hema : తెలుగులో హీరోయిన్ స్నేహితురాలిగా మొదలై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన హేమ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. హేమ అసలు పేరు కృష్ణ వేణి, తనది రాజోలు. ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వల్ల కూడా బాగా వైరల్ అయిన హేమ ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలిచారు. ఆ మధ్య మా ఎన్నికల సమయంలో శివబాలాజీ తో గొడవ, కొరకడం వంటి విషయాలతో బాగా వైరల్ అయింది హేమ. ఇక హేమ ఎవరి గురించైనా ఏ మాత్రం జంకు లేకుండా ఫ్రాంక్ గా మాట్లాడేస్తుంది.
అందుకే చేయడం లేదు…
నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు రెండో బ్రాంచ్ కిర్రాక్ ఆర్పీ మణికొండలో ఓపెన్ చేయడంతో అక్కడికి వచ్చిన హేమ కిర్రాక్ ఆర్పీ బిజినెస్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ తాను సినిమాలకు తగ్గించడానికి గల కారణాలను తెలిపింది. వేరే బిజినెస్ చేస్తున్నానని అందులో బాగా డబ్బులు రావడం, అలానే కష్టపడటానికి ఇష్టపడక పోవడంతో సినిమాలను బాగా తగ్గించినట్లు హేమ తెలిపారు.
డబ్బుకు లోటు లేకపోవడంతో సినిమాలలో కష్టపడంటున్నా హేమ సినిమాల్లో ఎంత పాపులర్ అయినా మా అధ్యక్ష ఎన్నికల సమయంలో గొడవలు పడి మరింత వైరల్ అయింది. చేపల పులుసు కోసం ఇక ఆర్పీ దగ్గరికే వస్తానంటూ తాను నాకు తమ్ముడితో సమానం అంటూ చెప్పింది హేమ.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…