Bigg Boss 8: తెలుగు బుల్లితెరపై ప్రసారం కాబోయే బిగ్ బాస్ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే ఎనిమిదవ సీజన్ ప్రారంభానికి సిద్ధమవుతుంది. ఈ సీజన్ అనుకున్న సమయాన్ని కంటే ముందుగానే అనగా ఆగస్టులోనే ప్రసారం కాబోతుందని సమాచారం.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ సెట్ మొత్తం రెడీ చేస్తూ ఉండగానే మరోవైపు కంటెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా జరుగుతోందని తెలుస్తోంది. అయితే ఈసారి సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సొంతం చేసుకున్న వారితో పాటు ఎక్కువగా సీరియల్స్ వారికే ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటికే పలువురు సీరియల్ ఆర్టిస్టుల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా మరొక ఆర్టిస్ట్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొగలిరేకులు వంటి బ్లాక్ బస్టర్ సీరియల్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు ఇంద్రనీల్. ఈ సీరియల్ లో ఇంద్ర పాత్రలో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు.
బిగ్ బాస్ కంటెస్టెంట్..
ఇక ఈ సీరియల్ తర్వాత పలు సీరియల్స్ లో నటించిన పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. అయితే ఈయన బిగ్ బాస్ 8 లో పాల్గొనబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి ఇంద్ర బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త వైరల్ అవుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…