Categories: FeaturedMovie News

Actor Muralidhar Gowd : నన్ను సినిమాలో నుంచి తీసేయడానికి కుట్ర చేసారు…: బలగం ఫేం మురళీధర్ గౌడ్

Actor Muralidhar Gowd : చిన్న సినిమాగా వచ్చిన ‘బలగం’ సినిమా నేడు రెండు రాష్ట్రాలలోనూ సంచలన విజయాన్ని నమోదు చేసింది. నగరాలు, గ్రామాలు అని తేడా లేకుండా అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తున్న సినిమా బలగం. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్టుకీ ఈ సినిమా మంచి పేరు అలాగే గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాలో నారాయణ పాత్రలో నటించిన మురళీధర్ గౌడ్ గారు సీనిమా గురించి అందులో అవకాశం ఎలా వచ్చింది వంటి విషయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

నన్ను సినిమాలో నుండి తీసేయాలని అనుకున్నారు…

మురళీధర్ గారు మెదక్ జిల్లా వాసి అయినా హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉన్నారు. ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేసి రిటైర్ అయ్యాక సినిమాల్లో నటించాలని ఇండస్ట్రీ వైపు అడుగులేసారు. మొదట్లో సీరియల్స్ లో చేసిన ఆయన సినిమా వైపు చూడలేదు. సినిమాల్లో నటించాలంటే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉండాలి అలా లేకుండా అక్కడ వెళ్లలేము అని సినిమా వైపు చూడలేదు అంటూ చెప్పారు. ఇక ఈటీవీ సీరియల్స్ లో నటించిన మురళీధర్ గారు అక్కడ కొంతమంది సలహాలు మేరకు సినిమాల్లో ప్రయత్నించాలని భావించారు. అలా చిన్న సినిమాలు అలాగే షార్ట్ ఫిలిమ్స్ మొదలు పెట్టిన మురళీధర్ గారికి తరుణ్ భాస్కర్ తీసిన ‘పిట్టకథలు’ సినిమా వల్ల మంచి గుర్తింపు వచ్చింది. అలాగే కథానాయకుడు, మహానాయకుడు సినిమాలలో కూడా చిన్న పాత్రలను చేశానని చెప్పారు.

ఆ తరువాత ‘డిజే టిల్లు’లో అవకాశం రావడం జరిగిందని డిజే టిల్లు ఆఫర్ తరువాత కొన్ని సినిమాల్లో అవకాశం వచ్చినా కొన్ని నచ్చక చేయలేదు. పెద్ధ బ్యానర్స్ నుండి అయితే పెద్దగా ఆఫర్స్ రాలేదు. పిట్ట కథలలో నా పాత్ర చూసే బలగంలో నన్ను తీసుకోవాలని వేణు అనుకున్నారట. అయితే నాకు తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్ నన్ను ఈ సినిమా ఆడిషన్ కి పిలవడం అలా నేను ఆడిషన్ కి వెళ్ళాను అంటూ తెలిపారు. ఇక సినిమాకు సెలెక్ట్ అయ్యాక కూడా ప్రొడ్యూసర్ వైపు నుండి నా క్యారెక్టర్ కి వేరేవాళ్లను తీసుకుందామని చర్చ జరిగిందని యూనిట్ లో చెప్పుకుంటే విన్నాను కానీ నిజం తెలియదు. అలా నన్ను తీసేయాలని ప్రయత్నించినా వేణు గారు నేనే కావాలి అని అడిగి పెట్టుకున్నారట అంటూ మురళీధర్ గారు తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago